Karnataka:నేటినుంచి కేఎస్సార్ఆర్టీసీ బస్సు సర్వీసులు పునర్ ప్రారంభం

ABN , First Publish Date - 2021-08-23T12:19:50+05:30 IST

కొవిడ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో కర్ణాటక స్టేట్ రోడ్డు ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్ సోమవారం నుంచి తమిళనాడు రాష్ట్రానికి బస్సుల రాకపోకలను పునర్ ప్రారంభించింది....

Karnataka:నేటినుంచి కేఎస్సార్ఆర్టీసీ బస్సు సర్వీసులు పునర్ ప్రారంభం

బెంగళూరు : కొవిడ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో కర్ణాటక స్టేట్ రోడ్డు ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్ సోమవారం నుంచి తమిళనాడు రాష్ట్రానికి బస్సుల రాకపోకలను పునర్ ప్రారంభించింది.కరోనా వైరస్ మహమ్మారి వల్ల ఈ ఏడాది ఏప్రిల్ 27వతేదీ నుంచి తమిళనాడు రాష్ట్రానికి కేఎస్సార్ఆర్టీసీ బస్సుల రాకపోకలను నిలిపివేసింది.ప్రస్థుతం కొవడ్ కేసుల సంఖ్య తగ్గడంతో సోమవారం కర్ణాటక నుంచి తమిళనాడు రాష్ట్రానికి 250 బస్సుల రాకపోకలను పునర్ ప్రారంభించింది. 


కర్ణాటక రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు 50 శాతం సీటింగ్ సామర్ధ్యంతో జూన్ 22 నుంచి  కేఎస్సార్ఆర్టీసీ బస్సుల రాకపోకలను పునరుద్ధరించింది.దీంతోపాటు కేరళ రాష్ట్రంలోని కోజికోడ్, కాసర్ ఘడ్ ప్రాంతాలకు డిమాండును బట్టి కొన్ని బస్సుసర్వీసులను  కేఎస్సార్ఆర్టీసీ నడుపుతోంది. కొవిడ్ మార్గదర్శకాల ప్రకారం శానిటైజ్ చేసి బస్సులను నడుపుతున్నామని  కేఎస్సార్ఆర్టీసీ అధికారులు చెప్పారు. 

Updated Date - 2021-08-23T12:19:50+05:30 IST