ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా యడియూరప్ప

ABN , First Publish Date - 2021-07-26T21:42:08+05:30 IST

ముఖ్యమంత్రి పదవికి బీఎస్ యడియూరప్ప చేసిన రాజీనామాను కర్ణాటక గవర్నర్ తావర్..

ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా యడియూరప్ప

బెంగళూరు: ముఖ్యమంత్రి పదవికి బీఎస్ యడియూరప్ప చేసిన రాజీనామాను కర్ణాటక గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్ సోమవారంనాడు ఆమోదించారు. కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేసేంత వరకూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని యడియూరప్పను కోరారు. నెలల తరబడి సాగుతున్న ఊహాగానాలకు యడియూరప్ప తెరదించుతూ విధాన సభలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. అనంతరం ఆయన రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిసి రాజీనామా పత్రం సమర్పించారు. ఆ వెంటనే మీడియా సమావేశంలో తన రాజీనామాను గవర్నర్‌ ఆమోదించినట్టు ప్రకటించారు. తనపై ఎవరి ఒత్తడి లేదని, రెండ్రోజుల క్రితమే రాజీనామా నిర్ణయాన్ని తీసుకున్నానని చెప్పారు. ముఖ్యమంత్రిగా ఎవరి పేరు తాను ప్రతిపాదించలేదని, ఎవరిని అధిష్ఠానం ముఖ్యమంత్రిగా నియమించినా ఆయనకు తాను, తన మద్దతుదారులు సంపూర్ణ మద్దతిస్తారని చెప్పారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త సీఎం సారథ్యంలో పనిచేస్తామని చెప్పారు. కాగా, కొత్త ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో కేంద్ర పరిశీలకులను బీజేపీ పంపనుందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

Updated Date - 2021-07-26T21:42:08+05:30 IST