Abn logo
Apr 2 2020 @ 14:13PM

కాంగ్రెస్సే అసలైన కరోనా అన్న కేసీఆర్ వ్యాఖ్యలను నిజం చేశారు: కర్నె ప్రభాకర్

హైదరాబాద్: లోకమంతా కరోనాపై పోరు చేస్తుంటే... తాము మాత్రం రాజకీయాల వైపే ఉన్నామని కాంగ్రెస్‌ నేతలు రుజువు చేశారని టీఆర్ఎస్ నేత కర్నె ప్రభాకర్ విమర్శించారు. కాంగ్రెస్సే అసలైన కరోనా అన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను ఆ పార్టీ నేతలు నిజం చేశారని పేర్కొన్నారు. వైద్య సిబ్బంది, పోలీసులకు ఇన్సెంటివ్స్ ఇస్తామని కేసీఆర్ స్పష్టంగా చెప్పారన్నారు.


వేతనాల విషయంలో ఉద్యోగస్తులు స్వచ్ఛందంగా తమ సమ్మతిని తెలియజేస్తూ ఉంటే కాంగ్రెస్ నేతలకు మాత్రం వ్యతిరేకంగా కనిపిస్తోందన్నారు. కాలేశ్వరం మూడో టీఎంసీ పనుల టెండర్లు ఎలా పిలుస్తారని కాంగ్రెస్ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని కర్నె ప్రభాకర్ విమర్శించారు. కాలేశ్వరం కేంద్ర ఆర్థిక సంస్థలు కొన్ని బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని కడుతున్న ప్రాజెక్టు అని తెలిపారు. 

Advertisement
Advertisement
Advertisement