కట్టుదిట్టంగా కర్ఫ్యూ

ABN , First Publish Date - 2021-05-06T06:01:52+05:30 IST

ప్రభుత్వ ఆదేశాలతో కనిగిరిలో బుధవారం కర్ఫ్యూ కట్టుదిట్టం గా అమలైంది.

కట్టుదిట్టంగా కర్ఫ్యూ

మధ్యాహ్నం 12 తర్వాత మూతపడిన దుకాణాలు

 నిర్మానుష్యంగా రోడ్లు

కనిగిరి, మే 5: ప్రభుత్వ ఆదేశాలతో కనిగిరిలో బుధవారం కర్ఫ్యూ కట్టుదిట్టం గా అమలైంది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత వ్యాపార సముదాయాలు, దుకా ణాలు మూతపడ్డాయి. దీంతో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ఇతర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో అత్యసవరమైన వారు ప్రైవేటు కార్లను ఆశ్రయిం చారు. ఆయా వాహనాలను పోలీసులు తనిఖీ చేసి, పరిశీలించి వదిలివేశారు. ఉదయం 6 నుంచి 12 గంటల వరకూ ఎలాంటి ఆంక్షలు లేపోవడంతో పట్ట ణంలోని ప్రధాన సెంటర్లలో రద్దీ నెలకొంది. చాలా మంది భౌతిక దూరం పాటించలేదు. దుకాణాల్లో కూడా కరోనా నిబందనలు గాలికొదిలేశారు. ఎక్కడా యజమానులు బయట శానిటైజ్‌ ఏర్పాటు చేయకపో వటంతో అలాగే ప్రజలు షాపుల్లోకి వెళ్లి కొనుగోలు చేశారు. 

కొవిడ్‌ నిబంధనలు విధిగా పాటించాలి

కరోనా ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో దాని కట్టడికి ప్రజలు నిబంధనలను విధిగా పాటించాలని తహసీల్దార్‌ పుల్లారావు కోరారు. పట్టణంలో బుధ వారం ఉదయం 144 సెక్షన్‌ అమలును ఆయన పోలీ సులతో కలిసి పర్యవేక్షించారు. ఈ సంధర్భంతో వివిధ చికెన్‌ దుకాణాలు, కూరగాయల షాపులను పరిశీలిం చి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఒంగోలు బస్టాండ్‌ వద్ద మున్సిపల్‌ కార్యాలయం పక్కన ఉన్న ఓ చికెన్‌ దుకాణం ఆపరిశుభ్రంగా ఉండటాన్ని గుర్తించిన ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని యజమానిని హెచ్చరించారు. ఆయన వెంట  ఎస్‌ఐ రామిరెడ్డి, పోలీసు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. అనం తరం మండలంలోని నందన మారెళ్ల గ్రామాన్ని తహ సీల్దార్‌ సందర్శించారు. అక్కడ గ్రామస్థులు కరోనా నిబంధనలు పాటించకుండా ఉండటంపై హెచ్చరికలు జారీ చేశారు. కరోనా బాధితుడి గృహానికి రెడ్‌ స్టిక్కర్‌ అంటించారు. ఆయన వెంట ఎంపీడీవో మల్లి కార్జునరావు, పంచాయతీ కార్యదర్శి రాంప్రసాద్‌, వీఆర్వో వెంకటస్వామి తదితరులు ఉన్నారు.

పీసీపల్లిలో.. 

పీసీపల్లి : కర్ఫ్యూ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్‌ పి.సింగారావు హెచ్చ రించారు. మండలంలోని గుంటుపల్లి, తురుకపల్లి, వెంగళాయపల్లి, పీసీపల్లి గ్రామా ల్లో బుధవారం ఆయన ఎస్‌ఐ ప్రేమ్‌కుమార్‌తో కలసి పర్యటిం చారు. కర్ఫ్యూ అమలును  పరిశీ లించారు. మధ్యాహ్నం 12గంటల తర్వాత రోడ్లపై ఎవ్వరు తిరిగినా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చ రించారు. ఉదయం 6 నుంచి 12 గంటల వరకూ 144సెక్షన్‌ అమ లులో ఉంటుందన్నారు. ఈ సమ యంలో ఎక్కడా నలుగురికి మిం చి ఉండకూడదన్నారు.  కాగా మండలంలో గడచిన 24గంటల్లో 29 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని మండల ఆరోగ్య విస్తరణాధికారి బేగ్‌ తెలిపారు.

సీఎస్‌పురంలో.. 

సీఎస్‌పురం : కర్ఫ్యూ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని తహసీల్దార్‌ జి.ఆంజనేయులు, ఎస్సై చుక్కా శివబసవరాజు సూచించారు. బుధవారం వారు సీఎస్‌పురంలో టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సభ్యులతో కలిసి కర్ఫ్యూను పర్యవేక్షించారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరవాలన్నారు. ఆతర్వాత జన సంచారం నిషేధమని తెలిపారు. అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని కోరారు.

గడపదాటితే కేసు

పామూరు:  కర్ఫ్యూ సమయంలో అనవసరంగా గడపదాటి బయటకు వస్తే కేసులు నమోదు చేస్తామని తహసీల్దార్‌ సీహెచ్‌. ఉష హెచ్చరించారు. పట్టణంలో కర్ఫ్యూ అమలును బుధవారం ఆమె పరిశీలించారు. అనంతరం స్థానిక మమ్మీడాడీ షోరూం సెంటర్‌లో కొవిడ్‌ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కర్ఫ్యూ అమలుకు ప్రజలు సహకరించాలని కోరారు. 

కార్యక్రమంలో ఎంపీడీవో ఎం.రంగసుబ్బరాయుడు, ఎస్సై అంబటి చంద్రశేఖర్‌ యాదవ్‌, ఉప సర్పంచ్‌లు వైవీ సాయికిరణ్‌, కందుల శ్రీనువాసులరెడ్డి, అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ దేవకృపావరం, గంగసాని హుస్సేన్‌రెడ్డి, పట్టణ వీఆర్వోలు పాల్గొన్నారు.

కొండపిలో.. 

కొండపి: కరోనా పాజిటివ్‌ కేసులు పెరు గుతున్న నేపథ్యంలో బుధవారం నుంచి కొం డపిలో కర్ఫ్యూ అమలు చేశారు. మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే  వ్యాపార, వాణిజ్య దుకాణాలకు అనుమ తించారు. ఆతర్వాత మూసి వేయించారు. బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా జన సంచారం తగ్గింది. వివిధ ప్రాంతాల్లో, కూడళ్లలో చెట్ల కింద కూర్చునేందుకు వేసిన సిమెంటు బల్లలను కూడా అధికారులు తొలగించారు. కర్ఫ్యూ అమలును పర్యవేక్షించేందుకు మండల, గ్రామ స్థాయిల్లో నోడల్‌ టీంలను తహసీల్దార్‌ ఏర్పాటు చేశారు. కొవిడ్‌ నిబంధనలను అతిక్రమించిన వారికి అపరాధ రుసుం విఽధించాలని గ్రామ స్థాయి కమిటీ సభ్యులకు ఆదేశాలిచ్చారు. 

మర్రిపూడిలో.. 

మర్రిపూడి: మండల కేంద్రమైన మర్రిపూడిలో క ర్ఫ్యూను తహసీల్దార్‌ బి.వెంకటరెడ్డి, ఎంపీడీవో కరిముల్లా, ఎస్‌ఐ ఎ.సుబ్బరాజు, వైద్యాధికారి సంగీత పర్యవేక్షించారు. 12గంటలకే దుకాణాలు మూసివే యించారు. 

వివిధ గ్రామాల నుంచి వచ్చే ఆటోలు, ద్విచక్రవాహనాలను అడ్డుకున్నారు. పోలీసు సిబ్బంది గ్రామంలో  పర్యటిస్తూ అనుమతులు లేకుండా తిరిగే వారికి హెచ్చరికలు జారీ చేశారు. 12గంటల తర్వాత దుకాణాలు తెరిచినా, అవసరం లేకుండా బయట తిరిగినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

Updated Date - 2021-05-06T06:01:52+05:30 IST