నిబంధనలు పాటించకపోతే కేసులు

ABN , First Publish Date - 2021-05-06T06:16:26+05:30 IST

కరోనా వైరెస్‌ను కట్టడి చేసేందుకు గ్రామా ల్లో కర్ఫ్యూ విధించామని, ఆ ప్రకారమే ప్రజలు నడుచుకోవాలని తహసీల్దార్‌ పి.పార్వతి, ఎంపీడీవో బి.చంద్రశేఖరరావు చెప్పారు.

నిబంధనలు పాటించకపోతే కేసులు

ముండ్లమూరు, మే 5: కరోనా వైరెస్‌ను కట్టడి చేసేందుకు గ్రామా ల్లో కర్ఫ్యూ విధించామని, ఆ ప్రకారమే ప్రజలు నడుచుకోవాలని తహసీల్దార్‌ పి.పార్వతి, ఎంపీడీవో బి.చంద్రశేఖరరావు చెప్పారు. నిబంధనలు పాటించకపోతే కేసులు నమోదు చేస్తామన్నారు. బుధవారం ముండ్లమూరులో వివాహం జరుగుతునట్టు సమాచారం అందుకున్న మండల టాస్క్‌ ఫోర్స్‌ బృందం ఆ ఇంటికి వెళ్లారు. 

ఇంటి సమీపంలోనే ఒక వ్యక్తికి కరోనా రావటంతో ఆందోళన చెందిన అధికారులు పెళ్లి వేదికను మరోచోటకు మార్చాలని ఆదేశించారు. 20 మందికి మించకుండా వివాహం చేసుకోవాలన్నారు.  మండల టాస్క్‌ఫోర్స్‌ బృందం ఉవ మహేశ్వర అగ్రహారం వెళ్ళి వలంటీర్లతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ జీ వెంకటసైదులు, పంచాయతీ కార్యదర్శి సురేష్‌రెడ్డి, వీఆర్‌వో తేజ తదితరులు పాల్గొన్నారు.

ముండ్లమూరుతో పాటు ఉమామహేశ్వర అగ్రహారం, తమ్మలూరు, వేంపాడు, పసుపుగల్లు, పెద ఉల్లగల్లు, పులిపాడు గ్రామాల్లో లాక్‌డౌన్‌ సందర్భంగా కర్ఫ్యూను ఎస్సై సైదులు పరిశీలించారు. ఈ సందర్భంగా దుకాణాలను మూయించారు.  

పోలీసులు అప్రమత్తంగా ఉండాలి

పామూరు, మే 5: రోజురోజుకూ విజృంభిస్తున్న కరోనా మహమ్మారి పట్ల పోలీసులు అప్రమత్తంగా ఉండి విధులు నిర్వమించాలని కందుకూరు డీఎస్పీ కండె శ్రీనివాసరావు సూచించారు. బుధవారం స్థానిక సర్కిల్‌ కార్యాలయంలో డాక్టర్‌ గద్దె ఏడుకొండలు ఆధ్వర్యంలో పలువురు పోలీసులకు వైద్య పరీక్షలు జరిపి సూచనలు చేశారు.

Updated Date - 2021-05-06T06:16:26+05:30 IST