అరకొరగా..

ABN , First Publish Date - 2021-04-14T05:04:55+05:30 IST

జిల్లాకు కరోనా టీకా నిల్వలు అరకొరగా చేరుకు న్నాయి. కరోనా వైరస్‌ రెండో దశ వ్యాప్తి చెందుతున్న వేళ.. జిల్లాలో లక్షలాది మందికి వ్యాక్సిన్లు అవసరం కాగా, కేవలం 40 వేల కొవిషీల్డ్‌ డోసులు మాత్రమే వచ్చాయి. మూడురోజులుగా జిల్లావ్యాప్తంగా టీకా నిల్వలు నిండుకున్నాయి. ఏ ఒక్క పీహెచ్‌సీలోనూ ఒక్క వ్యాక్సిన్‌ కూడా లేదు. ఈ నేపథ్యంలో నెల 11 నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించ తలపె ట్టిన ‘టీకా ఉత్సవ్‌’ నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. తాజాగా జిల్లాకు చేరుకున్న నిల్వలు కూడా మూడు రోజులకే సరిపడనున్నాయి.

అరకొరగా..
జిల్లా వైద్యఆరోగ్యశాఖ కార్యాలయానికి వచ్చిన టీకాను పంపిణీ చేస్తున్న దృశ్యం

జిల్లాకు చేరుకున్న టీకా నిల్వలు

 కేవలం 40వేల కొవిషీల్డ్‌ డోసులే 

 కొవాగ్జిన్‌  కోసం తప్పని ఎదురుచూపులు

(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి)

జిల్లాకు కరోనా టీకా నిల్వలు అరకొరగా చేరుకు న్నాయి. కరోనా వైరస్‌ రెండో దశ వ్యాప్తి చెందుతున్న వేళ.. జిల్లాలో లక్షలాది మందికి వ్యాక్సిన్లు అవసరం కాగా, కేవలం 40 వేల కొవిషీల్డ్‌ డోసులు మాత్రమే వచ్చాయి. మూడురోజులుగా జిల్లావ్యాప్తంగా టీకా నిల్వలు నిండుకున్నాయి. ఏ ఒక్క పీహెచ్‌సీలోనూ ఒక్క వ్యాక్సిన్‌ కూడా లేదు. ఈ నేపథ్యంలో నెల 11 నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించ తలపె ట్టిన ‘టీకా ఉత్సవ్‌’ నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. తాజాగా జిల్లాకు చేరుకున్న నిల్వలు కూడా మూడు రోజులకే సరిపడనున్నాయి.  

జిల్లాలో కరోనా కేసుల సంఖ్య క్రమేపీ పెరిగిపో తోంది. రోజూ వందల్లో పాజిటివ్‌ కేసులు నమోదవుతు న్నాయి. జిల్లాలో మంగళవారం 271 మంది కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో  కరోనా బాధితుల సంఖ్య 48,885కు చేరింది. వీరిలో చాలామంది కోలుకున్నారు. ప్రస్తుతం ఐసోలేషన్‌ కేంద్రంలో 1,445 మంది, కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో 177 మంది, కొవిడ్‌ ఆస్పత్రుల్లో 121 మంది చికిత్స పొందుతున్నారు. రోజు రోజుకీ కరోనా ఉధృతి పెరుగుతుండడం, మరో వైపు మరణాలు కూడా సంభవిస్తున్నాయి. కరో నా నివారణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రెండు వ్యాక్సిన్‌లను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇందులో ఒకటి కొవాగ్జిన్‌, మరొకటి కొవిషీల్డ్డ్‌. అత్యధిక మంది కొవాగ్జిన్‌ టీకాను ఇష్ట పడుతున్నారు. దీనిపై వైద్యసిబ్బందే ప్రచారం చేయడంతో ఈ టీకాకు ప్రాధాన్యం ఏర్పడింది. జిల్లాలో జనవరి 17నుంచి ఇప్పటివరకూ 2,00, 186 మందికి మాత్రమే కరోనా టీకా వేశారు. హెల్త్‌ వర్కర్స్‌, ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌, పట్టణంలో వృద్ధులకు మాత్రమే టీకాల ప్రక్రియ పూర్తయింది. ఇంకా లక్షలాది మంది కరోనా వ్యాక్సిన్‌ కోసం ఎదురు చూస్తున్నారు. జిల్లాలో సుమారు 70 శాతం మంది టీకాలు వేయాల్సి ఉంది. టీకాల కోసం ఆన్‌లైన్‌లో రిజి స్ర్టేషన్లు చేసుకుని.. సచివాలయాలు, అర్బన్‌ హెల్త్‌సెం టర్లు, పీహెచ్‌సీలకు ప్రజలు వెళ్తున్నారు. టీకా నిల్వలు లేవని వైద్యసిబ్బంది సమాధానం ఇస్తుండడంతో మూడు రోజులుగా వెనుదిరుగుతున్నారు. తాజాగా మంగళవారం జిల్లాకు 40వేల కొవిషీల్డ్‌ వ్యాక్సిన్లు చేరు కున్నాయి. కొవాగ్జిన్‌ నిల్వలు ఇంకా రాలేదు. జిల్లాలో లక్షలాది మందికి కరోనా టీకా అవసరం కాగా, అర కొరగానే వచ్చిన డోసులు మూడురోజులకే సరిపడను న్నాయి. మళ్లీ పూర్తిస్థాయిలో టీకాలు వచ్చే వరకూ ప్రజలు ఎదురుచూడాల్సిందే. ఇదిలా ఉండగా, ఇదివరకు కొవిషీల్డ్‌ టీకా తీసు కున్నవారికే మళ్లీ అదే టీకాను ఇస్తారా? లేదా... కొవాగ్జిన్‌ మొదటిడోస్‌ తీసుకున్నవారికి కూడా కొవిషీల్డ్‌ టీకా రెండో డోస్‌ కింద తీసుకోవచ్చో లేదో... అని ప్రజల్లో అనుమానాలు రేకెత్తుతున్నాయి. 


 125 సచివాలయాల్లో టీకాలు

జిల్లాకు 40 వేల డోసుల(4వేల వైల్స్‌) కొవిషీల్డ్‌ టీకా వచ్చిం ది. ఇప్పటికే క్షేత్రస్థాయికి పంపించే ఏర్పాట్లు చేపట్టాం. బుధ వారం ఉదయం 8గంటల నుంచి టీకా కార్యక్రమం 125 సచి వాలయాల్లో ప్రారంభం అవుతుంది. 106 గ్రామ సచివాల యాలు, 19 వార్డు సచివాలయాల్లో టీకా వేస్తాం. ఇప్పటివరకు టీకా తీసుకోని ఫ్రంట్‌లైన్‌ వర్కర్లందరూ బుధవారం వ్యాక్సిన్‌ వేసుకోవాలి. గురువారం మళ్లీ టీకాలు వచ్చే అవకాశం ఉంది.

- బి.జగన్నాథరావు, ఏడీఎంహెచ్‌వో

Updated Date - 2021-04-14T05:04:55+05:30 IST