కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలి

ABN , First Publish Date - 2021-05-06T06:14:11+05:30 IST

తీవ్రమవుతున్న కరోనా కట్టడికి కర్ఫ్యూ అమలు చేస్తున్నట్లు డీఎస్పీ కె. ప్రకాశరావు చెప్పారు.

కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలి

దర్శి డీఎస్పీ ప్రకాశరావు

దర్శి, మే 5: తీవ్రమవుతున్న కరోనా కట్టడికి కర్ఫ్యూ అమలు చేస్తున్నట్లు డీఎస్పీ కె. ప్రకాశరావు చెప్పారు. స్థానిక గడియారస్తం భం సెంటర్‌లో బుధవారం మధ్యాహ్నం క ర్ఫ్యూ అమలును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షాపులకు మ ధ్యాహ్నం 12 గంటల వరకే అనుమతి ఉంద ని, సామాజిక దూరం పాటిస్తూ ప్రజలు సరుకులు కొనుగోలు చేసుకోవాలన్నారు. ఆతర్వాత పూర్తిగా కర్ఫ్యూ అమల్లో ఉన్నందున ప్రజలు బయటకు రావద్దని సూచించారు. కార్యక్రమంలో సీఐ భీమానాయక్‌, ఎంపీడీవో జి.శోభన్‌బాబు, డిప్యూటి తహసీల్దార్‌ దేవప్రసాద్‌, ఎస్సై రామకోటయ్య, నగర పంచాయతీ కమిషనర్‌ ఆవుల సుధాకర్‌ పాల్గొన్నారు.

కాగా, దర్శి పట్టణంలో బుధవారం మధ్యాహ్నం నుంచి పటిష్టంగా కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ఎస్సై రామకోటయ్య ఆధ్వర్యంలో పోలీసులు ప్రధాన రహదారుల్లో గస్తీ తిరుగుతూ వాహనదారులను అడ్డుకొని జరిమానాలు విధిస్తున్నారు. 

లింగసముద్రంలో కట్టుదిట్టంగా అమలు

లింగసముద్రం, మే 5 : రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నుంచి అమలుచేస్తున్న 18 గంటల కర్ఫ్యూను పోలీ సులు, మహిళా పోలీసులు, వలం టీర్లు కట్టుదిట్టంగా అమలుచేశారు. మధ్యాహ్నం 12 గంటలు దాటిన వెం టనే ఎస్సై రమేష్‌ వ్యాపార దుకా ణాలను, టీ, టిఫిన్‌ హోటళ్లను మూ సివేయించారు. అనవసరంగా రోడ్ల పైకి వచ్చిన వాహనాలను పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ప్రజలు అధికారులకు పూర్తిగా సహకరిం చాలని తహసీల్దార్‌ ఆర్‌.బ్రహ్మయ్య, ఎంపీడీవో మాలకొండయ్యలు పేర్కొన్నారు.

Updated Date - 2021-05-06T06:14:11+05:30 IST