30న టీటీడీచే కార్తీక దీప మహోత్సవం

ABN , First Publish Date - 2020-11-26T06:12:00+05:30 IST

తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం వెనుక క్రీడా మైదానంలో ఈనెల 30వ తేదీన కార్తీక దీప మహోత్సవం

30న టీటీడీచే కార్తీక దీప మహోత్సవం

 తిరుపతి, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం వెనుక క్రీడా మైదానంలో ఈనెల 30వ తేదీన కార్తీక దీప మహోత్సవం నిర్వహిస్తున్నట్లు అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. కరోన మహమ్మరిని దూరం చేయటానికి టీటీడీ తొలిసారి ఈ కార్యక్రమం నిర్వహిస్తోందన్నారు. తిరుపతిలోని వేద వర్సిటీలో బుధవారం ఆయన అధికారులతో సమీక్షించారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ మహిళలు కార్తీక దీప మహోత్సవంలో సామూహిక లక్ష్మీనీరాజన దీపాలు పెట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. మైదానంలోకి రావడానికి ప్రత్యేక ప్రవేశ ద్వారాలను ఏర్పాటు చేయాలన్నాన్నారు. వేద స్వస్తి, విష్ణు సహస్ర నామ పారాయణం, దీప లక్ష్మీపూజలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ కార్తీక దీపోత్సవంలో కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి అనుగ్రహ భాషణం చేస్తారన్నారు. ఈ సమీక్షలో జేఈవో సదాభార్గవి, వేదిక్‌ యూనివర్శిటీ వీసీ సుదర్శన శర్మ తదితరులు పాల్గొన్నారు. 


కంచి పీఠాధిపతికి ఆహ్వానం

టీటీడీ నిర్వహించే కార్తీక దీప  మహోత్సవంలో పాల్గొనాలని కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతిని బుధవారం రాత్రి టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి, తిరుమల ఆలయ ఓఎస్డీ శేషాద్రి ఆహ్వానించారు. కాగా, తిరుమల వసంత మండపంలో జరగనున్న తులసీ ధాత్రి సహిత దామోదర వ్రతంలో గురువారం ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు విజయేంద్ర సరస్వతి పాల్గొననున్నారు. 

Updated Date - 2020-11-26T06:12:00+05:30 IST