Advertisement
Advertisement
Abn logo
Advertisement

హాంకాంగ్‌లో ఘనంగా కార్తీక మాస పూజలు, వనభోజనాలు!

హాంకాంగ్ తెలుగు సమాఖ్య వారు కార్తీక మాస పూజలు, వనభోజనాలు ఘనంగా నిర్వహించారు. హాంకాంగ్‌లోని భారతీయ యువ జంటలతో సత్యనారాయణ వ్రతం చేయించారు. మొదట్లో హాంకాంగ్‌లో పురోహితులు లేక వ్రతం జరిపించడం కష్టంగా మారినప్పటికీ తెలుగు సమాఖ్య వారి చొరవతో గత కొన్నేళ్లుగా నిరాటంకంగా ఈ వ్రతం జరుగుతోంది. తెలుగు సమాఖ్య అధ్యక్షురాలు శ్రీమతి జయ పీసపాటి ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకున్నారు. పత్రి భీమసేన సారథ్యంలో వ్రతం నిర్విఘ్నంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన హిందూ దేవాలయ సిబ్బందికి నిర్వహకులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా.. సమాఖ్య వారు ఏర్పాటు చేసిన కార్తీక వనభోజనంలో అక్కడి తెలుగు వారు ఉత్సాహంగా పాల్గొన్నారు.

TAGS: NRI
Advertisement
Advertisement