Advertisement
Advertisement
Abn logo
Advertisement

రాజన్న క్షేత్రంలో కార్తీక రద్దీ

వేములవాడ, నవంబరు 26 :  వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం శుక్రవారం నాడు భక్తులతో రద్దీగా మారింది. కార్తీక శుక్రవారం నాడు శ్రీరాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా వారు ధర్మదర్శనం, శీఘ్రదర్శనం క్యూలైన్ల మీదుగా ఆలయంలోకి చేరుకుని తమ ఇష్టదైవమైన శ్రీస్వామివారిని దర్శించుకుని తరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు కోడెమొక్కులు చెల్లించుకున్నారు. బాలాత్రిపురాసుందరీదేవి ఆలయంలో కుంకుమపూజల్లో పాల్గొన్నారు. శ్రీస్వామివారి నిత్యకళ్యాణం, సత్యనారాయణవ్రతం తదితర ఆర్జిత సేవలలో పాల్గొన్నారు.

Advertisement
Advertisement