Advertisement
Advertisement
Abn logo
Advertisement

వేడుకగా కార్తీక దీపోత్సవం


రొద్దం, డిసెంబరు 2: మండలంలోని ఆర్‌ మరువపల్లి గ్రామంలో వెలసిన సాయిబాబా దేవాలయంలో కార్తీక దీపోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. మహిళలు పెద్దసంఖ్యలో ఆలయానికి చేరుకుని దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. 


అమరాపురం: మండల కేంద్రంలోని షిరిడీ సాయిబాబా ఆలయంలో గురువారం లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఉదయం 8 గంటలకు స్వామివారికి అభిషేకం, పంచామృతాభిషేకం అనంతరం ప్రత్యేక పూజలను అర్చకులు నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు హోమం, సాయిఅర్చన, భజన, సంకీర్తన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. 


Advertisement
Advertisement