Advertisement
Advertisement
Abn logo
Advertisement

నేత్రపర్వంగా కార్తీక దీపోత్సవం

అనంతపురం టౌన, నవంబరు 29 :   కార్తీక మాసం చివరి సోమవారాన్ని పురస్క రించుకుని జిల్లా వ్యాప్తంగా కార్తీక దీపో త్సవాలు నేత్రపర్వంగా సాగాయి. శివాల యాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి.  ఓం నమఃశివాయ అంటూ పుర వీ ధులన్నీ మార్మోగాయి.  జిల్లా కేంద్రంలో మొదటిరో డ్డు కాశీవిశ్వేశ్వరాలయం, ఆరో రోడ్డు శివాలయం, అరవిందనగర్‌ సర్వేశ్వ రాలయం తదితర శివాలయాలన్నీ కార్తీక దీపకాంతులతో దేదీప్యమానంగా వెలుగొం దాయి. చిన్న, పెద్ద తేడాలేకుండా మహిళ లు పెద్దఎ త్తున ఆలయాలకు చేరుకుని కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. మహాశి వుడికి ప్రత్యేక అలంకరణలు గావించి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు.


Advertisement
Advertisement