యాదాద్రి క్షేత్రంలో భక్తిశ్రద్ధలతో కార్తీక పూజలు

ABN , First Publish Date - 2021-11-26T06:55:41+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో గురువా రం కార్తీక పూజల ను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

యాదాద్రి క్షేత్రంలో భక్తిశ్రద్ధలతో కార్తీక పూజలు
బాలాలయంలో లక్ష్మీనృసింహుల నిత్యతిరు కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తున్న అర్చకులు

యాదాద్రి టౌన్‌, నవంబరు 25: యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో గురువా రం కార్తీక పూజల ను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కొండకింద తులసీ కాటేజ్‌లోని కల్యాణ కట్టలో మొక్కు తలనీలాలు సమ ర్పించిన భక్తులు దైవ దర్శనాల కోసం కొండపైకి చేరుకున్నారు. బాలాలయంలో కవచమూర్తులను దర్శించుకున్న అనంతరం నిత్య తిరుకల్యాణోత్సవం, సువర్ణ పుష్పార్చన, అష్టోత్తర పూజలు, సత్యనారాయణస్వామి వ్రతాలు, దీపారాధన పూజల్లో కుటుంబసమేతంగా పాల్గొని మొక్కులు చెల్లించారు.  దర్శనాల అనంతరం ప్రసాదాల కొనుగోలు కోసం భక్తులు క్యూలైన్లలో బారులుతీరారు. స్వామి సన్నిధిలో 400 మంది దంపతులు సత్యనారాయణస్వామి వ్రత పూజల్లో పాల్గొన్నారు. ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.4,45లక్షల ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు తెలిపారు. అనుబంధ పాతగుట్ట ఆలయంలోనూ పూజాలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. స్వామికి వివిధ విభాగాల ద్వారా రూ.13,89,223 ఆదాయం సమకూరిందని దేవస్థాన అధికారులు తెలిపారు. 

బంగారు తాపడానికి విరాళాలు

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ విమాన గోపురం బంగారు తాపడం కోసం హైదరాబాద్‌, కూకట్‌పల్లికి చెందిన భక్తుడు ఎం.ప్రదీప్తపు రోహిత్‌లు రూ.5లక్షలు, భువనగిరి మండలం వడాయిగూడెం గ్రామ సర్పంచ్‌ గుండు సంతోషిణిమనీష్‌గౌడ్‌ దంపతులురూ.1,00,116 చెక్కులను వేర్వేరుగా దేవస్థాన ప్రధాన కార్యాలయంలో ఈవో ఎన్‌.గీతారెడ్డికి అందజేశారు. 


Updated Date - 2021-11-26T06:55:41+05:30 IST