Advertisement
Advertisement
Abn logo
Advertisement

శంభో.. శంకర

మార్మోగిన శివనామ స్మరణ 

భక్తులతో కిటకిటలాడిన శైవ క్షేత్రాలు 

 సోమేశ్వరుడి ఆలయంలో 50 వేలు, క్షీరా రామంలో 35 వేల మంది దర్శనం


నరసాపురం టౌన్‌, నవంబరు 29: కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు శివాలయాల్లో పూజలు చేశారు. వలంధర్‌, అమరేశ్వర రేవులు కిటకిటలా డా యి. మహిళలు నదిలో కార్తీక దీపాలను విడిచిపెట్టారు. మం డలంలోని లక్ష్మణేశ్వరస్వామి ఆలయంలో మధ్యాహ్నం వరకు భక్తుల రద్దీ తగ్గలేదు. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ జడ్పీటీసీ చాగంటి సత్యనారాయణ దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు చాగంటి వెంకట రమణ వరప్రసాద్‌, శ్రీనివాస్‌, సతీష్‌కుమార్‌, రాజాల ఆర్థిక సహ కారంతో అన్నసమారాధన నిర్వహించారు. 

ఆచంట రామేశ్వరస్వామి ఆలయంలో

ఆచంట, నవంబరు 29 : ఆచంట రామేశ్వర స్వామి ఆల యం భక్తుల శివనామస్మరణతో మార్మోగింది. ఆలయంలో ఉన్న అఖండ జ్యోతిలో అనేక మంది భక్తులు ఆవు నెయ్యి వడ్డించారు. పూజలు చేశారు. భక్తులకు కావాల్సిన ఏర్పాట్లను ఆలయ అధికారి గుబ్బల రామపెద్దింట్లురావు, చైర్మన్‌ నెక్కంటి  రామలింగేశ్వరరావు, కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. 

భీమవరం సోమేశ్వరుడి సన్నిధిలో..

భీమవరం రూరల్‌/ఎడ్యుకేషన్‌, నవంబరు 29 : పంచారామ క్షేత్రమైన సోమేశ్వరస్వామి దర్శనానికి భక్తులు మొదటి మూడు సోమవారాల కంటే అధికంగా వచ్చారని సోమవారం దాదాపు 50 వేల మంది దర్శించుకుని పూజలు చేసినట్టు ఆలయ అధికారులు తెలిపారు. స్వామికి అభిషేకాలు, ప్రత్యేక దర్శనం టికెట్లద్వారా 4లక్షల 36 వేల రూపాయలు ఆదాయం వచ్చిందని తెలిపారు. తెల్లవారుజామున అర్చకుడు చెరుకూరి రామకృష్ణ ఆద్వర్యంలో స్వామికి అభిషేకాలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. శాసనమండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. అర్చకులు ఆశీర్వచనాలు అందించారు. ఆలయ ఈవో అరుణ్‌కుమార్‌ భక్తులకు కావాల్సిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. వన్‌టౌన్‌ సీఐ అళ్ళ కృష్ణభగవాన్‌ బందోబస్తును పర్యవేక్షించారు. భక్తులకు ఉమాసోమేశ్వర జనార్దన స్వామి కార్తీక అన్నసమారాధన కమిటీ ఆధ్వర్యంలో పరుచూరి నాగేశ్వరరావు మిత్రబృందం సౌజన్యంతో అన్నప్రసాదాన్ని అందించారు. కార్యక్రమాన్ని ఆర్యవైశ్య వర్తక సంఘం అధ్యక్షుడు  మానేపల్లి నాగన్నబాబు ప్రారంభించారు. పూసరపు కృష్ణ, తటవర్తి బద్రి, తదితరులు పాల్గొన్నారు. మండలంలో యనముదుర్రు శక్తీశ్వరస్వామి, దిరుసుమర్రు గంగా భ్రమరాంబిక రామలింగేశ్వరస్వామి ఆలయాల్లో పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడాయి. తుందుర్రు, తాడేరు, బేతపూడి, గ్రామాల్లో శివాలయాల్లో అభిషేకాలు చేశారు. 


 పాలకొల్లు క్షీరారామంలో..

పాలకొల్లు అర్బన్‌, నవంబరు 29 : పంచారామ క్షేత్ర మైన క్షీరారామలింగేశ్వరస్వామిని దర్శించుకునేందుకు పలు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు దర్శించుకున్నారు. వేకువ జామునుంచి క్యూలైన్లలో నిలిచారు. సుమారుగా 35 వేల మంది స్వామిని దర్శించుకున్నట్టు ఆలయ వర్గాల సమాచారం. స్వామికి అభిషేకాలు, అర్చనలు , అమ్మవా ర్లకు పూజలు చేశారు. మహిళలు కార్తీక దీపాలు వెలిగించి బ్రాహ్మణులకు దానాలు చేశారు. భక్తులకు కావాల్సిన ఏర్పాట్లను ఆలయ సిబ్బంది, పట్టణ పోలీసులు, వలంటీర్లు ఏర్పాట్లు పర్యవేక్షించారు. కార్యక్రమాల్లో ఈవో  యాళ్ళ సూర్య నారాయణ, పాలక మండలి చైర్మన్‌ కోరాడ శ్రీనివాసరావు, ట్రస్టీలు, పాల్గొన్నారు. శంకర మఠంలోని అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామికి, 24వ వార్డులోని శంభేశ్వరస్వామికి అభిషేకాలు నిర్వహించారు. 

సోమేశ్వరాలయంలో భక్తులకు అన్న ప్రసాదం


Advertisement
Advertisement