Abn logo
May 8 2020 @ 12:45PM

ఆ సినిమా నుండి త‌ప్పుకున్న కార్తికేయ‌.. ‘ఆర్ఆర్ఆర్’ కార‌ణ‌మా?

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి త‌న‌యుడు కార్తికేయ నిర్మిస్తోన్న చిత్రం ‘ఆకాశ‌వాణి’. అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఎం.ఎం.కీర‌వాణి త‌న‌యుడు కాల‌భైర‌వ సంగీత ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ తుది ద‌శకు చేరుకుంది. తాజా స‌మాచారం మేర‌కు ‘ఆకాశ‌వాణి’ సినిమా నిర్మాణం నుండి కార్తికేయ త‌ప్పుకున్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. అందుకు కార‌ణం ‘ఆర్ఆర్ఆర్‌’ సినిమాయేన‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. క‌రోనా వ‌ల్ల ‘ఆర్ఆర్ఆర్‌’  చిత్రీక‌ర‌ణ వాయిదా ప‌డింది. ఈ సినిమా మేకింగ్‌లోనూ రాజమౌళికి కార్తికేయ సహకారం అందిస్తున్నారు. రెండు సినిమాల‌కు కార్తికేయ స‌మ‌యం కేటాయించ లేక‌పోవ‌డంతో ‘ఆకాశ‌వాణి’ నుండి కార్తికేయ త‌ప్పుకున్న‌ట్లు టాక్‌. 

Advertisement
Advertisement
Advertisement