Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆలయాల్లో కార్తీకమాస సందడి

కార్తీకమాసం పూర్తి కావస్తుండటంతో ఆలయాల్లో  భక్తులు ప్రత్యేక పూజలు, వ్రతాలు నిర్వహిస్తున్నారు. గురువారం జిల్లాలోని పలు మండలాల్లోని ఆలయాల్లో భక్తుల పూజలతో సందడి నెలకొంది. 

హుజూర్‌నగర్‌ , డిసెంబరు 2 : పట్టణంలో పార్వతీబీమలింగేశ్వరస్వామి దేవాలయంలో మారేడుదళాలతో లక్షపత్రి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా రుద్రాభిషేకం, సహస్ర లింగార్చన, కార్తీకదీపారాధన, గుడిసేవ నిర్వహించారు. కార్యక్రమంలో ఈవో కొండారెడ్డి, కోటసూర్యాప్రకాశ్‌, సతీ్‌షశర్మ, సుబ్రమణ్యం, పద్మ, సురేష్‌, కీతా మల్లిఖార్జున్‌ పాల్గొన్నారు. 


వేణుగోపాలస్వామి ఆలయ పవిత్రోత్సావాలు షురూ

శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ పవిత్రోత్సావాలు ప్రారంభమయ్యాయి. రెండురోజులపాటు నిర్వహించే ఉత్సవాల్లో మొదటి రోజు 18 కలశాలతో అగ్నిహోమం, ఆరగింపు, అభిషేకాలు, అంకురార్పణ నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్‌ కొత్తా నాగరాజు, ఈవో లక్ష్మణ్‌రావు, గోపాలం, వెంకటేశ్వర్లు, సైదులు, గురుస్వామి, శ్రీనివాసాచార్యులు పాల్గొన్నారు. 


బూరుగడ్డలో అన్నమాభిషేకం

హుజూర్‌నగర్‌ రూరల్‌: మండలంలోని బూరుగడ్డ గ్రామ పరిధిలోని సంతాన నాగేంద్రసహిత పార్వతీరామలింగేశ్వరస్వామి దేవాలయంలో శివలింగానికి అన్నమాభిషేకం నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజలు కొనసాగాయి. కార్యక్రమంలో అరుణ్‌కుమార్‌, రాధికా, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 


ఘనంగా శివపార్వతుల కల్యాణం

తుంగతుర్తి: మండలకేంద్రంలోని శివాలయంలో శివపార్వతుల కల్యాణం ఘనంగా నిర్వహించారు. అనంతరం పల్లకి సేవ, అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.  భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కల్యాణాన్ని తిలకించారు. పూజారి ఆమంచి అనంతరామ శర్మ, హరకిషన్‌, భక్తులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement