Advertisement
Advertisement
Abn logo
Advertisement

నిజాంపై పోరులో కాశయ్య లేరు

‘అజాత శత్రువు’ శీర్షికతో దివంగత చేకూరి కాశయ్యపై డా. యలమంచిలి శివాజీ రాసిన వ్యాసానికి (మే 27) సంబంధించి కొన్ని అభ్యంతరాలున్నాయి. హైదరాబాద్ రెడ్డి హాస్టల్ నిజాం వ్యతిరేక పోరాటానికి కేంద్ర బిందువు అని శివాజీ రాయడాన్ని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. నిజాం రాజ్యం ఉన్నంత కాలం రెడ్డి హాస్టల్ విద్య, సాంస్కృతిక కేంద్రంగా ఉండి అనేక మంది ఉన్నత విద్యాభ్యాసం చేయడానికి తోడ్పడింది. వ్యాసంలో పేర్కొన్న నాయకులు రెడ్డి హాస్టల్‌లో సమావేశమైంది విశాలాంధ్ర ఏర్పాటులో భాగంగా మాత్రమే.


అప్పటికి నిజాం ప్రభుత్వం లేదు. పుచ్చలపల్లి సుందరయ్య అనే నాయకుడు 1953 వరకూ అప్పటి తెలంగాణ భూభాగంలో భౌతికంగా అడుగుపెట్టలేదని ఆయనే రాసుకున్నాడు. చేకూరి కాశయ్య ఉర్దూను అమితంగా ప్రేమించేవారు. అది చాలా అందమైన భాష అని వేదికల మీదనే చాలాసార్లు చెప్పారు. నిజాం ప్రభుత్వంలో చాలా నాణ్యమైన విద్యను పాఠశాలల్లో అందించేవారని ఆయన అభిప్రాయ పడ్డారు. తాను నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నట్టు ఆయన ఏనాడూ చెప్పలేదు. 


డా. కె. శ్రీరామ్

డా. ఎన్. అజయ్ 

హైదరాబాద్ డెక్కన్ ఇండిపెండెంట్ రీసెర్చర్స్ గ్రూప్ 

హైదరాబాద్ 

Advertisement
Advertisement