ఔషధ కషాయం

ABN , First Publish Date - 2020-07-20T22:02:00+05:30 IST

ధనియాలు - అరకప్పు, జీలకర్ర - పావు కప్పు, మిరియాలు - 2 టేబుల్‌ స్పూన్లు, సోంపు - 1 టీ స్పూను, యాలకులు

ఔషధ కషాయం

కావలసిన పదార్థాలు: ధనియాలు - అరకప్పు, జీలకర్ర - పావు కప్పు, మిరియాలు - 2 టేబుల్‌ స్పూన్లు, సోంపు - 1 టీ స్పూను, యాలకులు - 6, లవంగాలు - 10, పసుపు - అర టీ స్పూను, శొంఠిపొడి - అర టీ స్పూను, తాటి బెల్లం 2 టీ స్పూన్లు, నీరు - రెండున్నర కప్పులు, పాలు - పావు కప్పు.


తయారుచేసే విధానం: కడాయి వేడి చేసి ముందుగా ధనియాలు, జీలకర్ర, మిరియాలు, సోంపు, యాలకులు, లవంగాలు ఒకటి తర్వాత ఒకటి వేస్తూ చిన్నమంటపై వేగించుకోవాలి. మాడిపోకూడదు. ఇవి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పసుపు, శొంఠిపొడి జత చేసి మెత్తగా పొడి చేసుకోవాలి. నీటిని బాగా వేడి చేసి మసులుతున్నప్పుడు 3 టీ స్పూన్లు పొడి వేసి రెండు నిమిషాలు మరిగించి బెల్లం కలపాలి. మరో రెండు  నిమిషాల తర్వాత వేడి చేసి చల్లార్చిన పాలుపోసి బాగా కలిపి వేడిగా ఉన్నప్పుడే తాగాలి. రోగ నిరోధక శక్తిని పెంచే మంచి కషాయం ఇది.

Updated Date - 2020-07-20T22:02:00+05:30 IST