అంగరంగ వైభవంగా పెళ్లి.. రాత్రి పూట అత్తారింటికి వధువు చేరుకున్న తీరును చూసి నివ్వెరపోయిన బంధువులు!

ABN , First Publish Date - 2021-08-27T01:09:37+05:30 IST

ఈ వధువు చాలా ఫాస్ట్.. వైరల్ అవుతున్న వీడియో

అంగరంగ వైభవంగా పెళ్లి.. రాత్రి పూట అత్తారింటికి వధువు చేరుకున్న తీరును చూసి నివ్వెరపోయిన బంధువులు!

ఇంటర్నెట్ డెస్క్: రోజులు మారిపోయాయి.. పెళ్లిళ్లలోనూ కొత్త ట్రెండ్లు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు అప్పగింతలంటే..పెళ్లికూతురి తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకోవడం.. ‘అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో బాబూ..’ అంటూ అల్లుడికి జాగ్రత్తలు చెప్పడం..ఇదీ చాలా కామన్ సీన్! కానీ నేటితరం యువతులు సబలలు. అందుకే పెళ్లిళ్లు, అప్పగింతల్లోనూ కొత్త ట్రెండ్‌లు సృష్టిస్తున్నారు. 


తాజాగా ఓ పెళ్లికూతురు తన భర్తను కారులో ఎక్కించుకుని రాత్రి వేళ తానే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ అత్తారింటికి వెళ్లిపోయింది.ఆమె ఎక్కడా తొణకకుండా బెణకకుండా.. భర్త వెంటరాగా తొలిసారిగా అత్తారింట్లో కాలు పెట్టింది. అంతేకాదు..బాధపడుతున్న తల్లిదండ్రులకు కూడా ఆమె ధైర్యం చెప్పింది. ఆమె తీరుకు తొలుత నివ్వెరపోయిన బంధువులు చివరికి..కొత్త ట్రెండ్ సృష్టించావంటూ వధువుపై ప్రశంసల వర్షం కురిపించారు. కశ్మీర్‌లో బారాముల్లా జిల్లాలో ఆగస్టు 24న జరిగిన ఈ వివాహం తాలూకు వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లను మురిపిస్తున్నాయి. వేల కొద్దీ లైకులు షేర్లతో ట్రెండ్ అవుతున్నాయి. 



Updated Date - 2021-08-27T01:09:37+05:30 IST