Advertisement
Advertisement
Abn logo
Advertisement

కశ్మీరి పులావ్‌

కావలసిన పదార్థాలు: బాస్మతి బియ్యం- కప్పు, జీలకర్ర- స్పూను, శొంఠి- కొంచెం, లవంగాలు- మూడు, యాలకుల పొడి- చిటికెడు, కుంకుమ పువ్వు- కొంచెం, నెయ్యి- మూడు స్పూన్లు, ఉప్పు, నీళ్లు - తగినంత, దాల్చిన చెక్క- అంగుళం ముక్క, జీడిపప్పు- పది, బాదం- పది, వాల్నట్స్‌- పది, ఉల్లిగడ్డ- ఒకటి, ఆపిల్‌, పైనాపిల్‌, దానిమ్మ గింజలు- రెండు కప్పులు (అన్నీ కలిపి).


తయారుచేసే విధానం: బియ్యాన్ని బాగా కడిగి ఇరవై నిమిషాలు నీళ్లలో నానబెట్టాలి. ఓ పాన్‌లో నూనె వేసి దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేయించాలి. ఆ తరవాత శొంఠి కూడా వేయాలి. దీంట్లోనే బాస్మతి బియ్యం, కుంకుమ పువ్వు, ఉప్పు కూడా వేసి బాగా కలిపి పాన్‌ మూత పెట్టి మూడు విజిల్స్‌ తరవాత దించాలి. ఓ బాణలిలో నెయ్యి వేసి ఉల్లిగడ్డ ముక్కల్ని దోరగా వేయించి పక్కనే పెట్టుకోవాలి. ఇందులోనే జీడిపప్పు, బాదం, వాల్‌నట్స్‌ దోరగా వేయించుకోవాలి. ఓ వెడల్పాటి పాత్రలో బాస్మతి అన్నాన్ని వేసి పండ్ల ముక్కలు, వేయించిన ఉల్లిగడ్డ, బాదం ముక్కల్ని కూడా కలిపితే కశ్మీరి పులావ్‌ రెడీ.

పటిశప్త ఉందియువెజ్‌ లాలీపాప్‌చైనీస్‌ ఫైవ్‌ స్పైస్‌ రైస్‌పెరుగు శాండ్‌విచ్‌కశ్మీరీ కహ్వా టీపనీర్‌ వెర్మిసెల్లీ బాల్స్‌చిల్లీ-ఆనియన్‌ క్రాకర్స్‌పత్తర్‌ కా ఘోష్‌లేడీ ఫింగర్‌ (బిస్కెట్‌)
Advertisement

నవ్య మరిన్ని