Advertisement
Advertisement
Abn logo
Advertisement
Dec 6 2021 @ 01:38AM

రైతుల లాగే కశ్మీరీలూ త్యాగాలు చేయాలేమో: ఫరూఖ్‌ అబ్దుల్లా

శ్రీనగర్‌, డిసెంబరు 5: కశ్మీర్‌   ప్రజలు  ఆర్టికల్‌ 370, రాష్ట్ర హోదాను మళ్లీ పొందాలంటే రైతుల లాగే త్యాగాలు చేయాల్సి ఉంటుందేమోనని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్సీ) అధ్యక్షుడు ఫరూఖ్‌ అబ్దుల్లా అన్నారు. తన తండ్రి, ఎన్సీ వ్యవస్థాపకుడు షేక్‌ అబ్దుల్లా 116వ జయంతి సందర్భంగా శ్రీనగర్‌లో నిర్వహించిన పార్టీ యువ విభాగం సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ఏడాది పాటు రైతులు సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడి ఆ చట్టాలను రద్దు చేయించారు. అలాగే ఆర్టికల్‌ 370 పునరుద్ధరణకు, రాష్ట్ర హోదాను మళ్లీ పొందేందుకు కశ్మీరీలు కూడా త్యాగాల్సి చేయాల్సిన పరిస్థితి రావచ్చు. అయితే హింసను మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించం. 370 పునరుద్ధరణ, రాష్ట్ర హోదాను మళ్లీ తెస్తామని మేము హామీ ఇచ్చాం. అందు కోసం ఎలాంటి త్యాగానికైనా మేము సిద్ధమే’’ అని ఫరూఖ్‌ పేర్కొన్నారు.

Advertisement
Advertisement