Abn logo
Apr 1 2020 @ 04:05AM

వైద్య, ఆరోగ్యశాఖ కమిషనర్‌గా కాటమనేని భాస్కర్‌

రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌గా కాటమనేని భాస్కర్‌ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మంగళవారం రాత్రి పొద్దుపోయాక ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన శాప్‌ ఎండీగా పనిచేస్తున్నారు. పర్యాటకశాఖ కార్పొరేషన్‌ ఎండీగా ఉన్న ప్రవీణ్‌కుమార్‌ కు శాప్‌ ఎండీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.

Advertisement
Advertisement
Advertisement