Abn logo
Oct 28 2020 @ 12:54PM

`అవతార్` సీక్వెల్.. కేట్ విన్‌స్లెట్ సాహసం!

Kaakateeya

హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి `అవతార్‌`. ప్రస్తుతం ఆ సినిమాకు కొనసాగింపుగా రెండో భాగం తెరకెక్కుతోంది. విజువల్ వండర్‌గా తెరకెక్కిన తొలి భాగానికి సీక్వెల్‌గా మరో నాలుగు సినిమాలు రాబోతున్నాయి. ప్రస్తుతం తెరకెక్కుతున్న రెండో భాగం మొదటి భాగం కంటే అద్భుతంగా ఉంటుందట. 


ఈ రెండో భాగంలో పండోరా గ్రహాన్ని పూర్తిగా చూపెట్టబోతున్నారట. అలాగే నీటి అడుగు భాగంలో కూడా కొన్ని సీన్లు ఉంటాయట. ఈ సినిమాలో కేట్ విన్‌స్లెట్, క్లిఫ్ కర్టిస్, బ్రెన్ డన్ కవెల్ లాంటి టాప్ స్టార్స్ కనిపించబోతున్నారు. ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా కేట్ విన్‌స్లెట్ నీటి అడుగున ఏకంగా ఏడు నిమిషాల 14 సెకెండ్ల పాటు ఊపిరి బిగపట్టి ఉందట. ఫ్రీ-డైవ్ కూడా నేర్చుకుందట. నీటి అడుగున షూటింగ్ చేస్తున్న ఫొటో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారింది. ఈ సినిమా డిసెంబర్ 16, 2022న విడుదల కాబోతోంది.  

Advertisement
Advertisement