Abn logo
Oct 21 2020 @ 23:40PM

నాలుగు దేశాల్లో సూపర్‌ ‘హీరో’యిన్‌

Kaakateeya

కట్రీనా కైఫ్‌...ఇన్నాళ్లూ బాలీవుడ్‌ హీరోయిన్‌. త్వరలోనే బాలీవుడ్‌ తెరపై తొలి సూపర్‌ హీరోయిన్‌ అవ్వబోతున్నారు. అలీ అబ్బాస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగు వచ్చే ఏడాది ప్రారంభమవుతుంది. ఈ చిత్రాన్ని భారీ ఎత్తున తెరకెక్కించే ప్రయత్నాల్లో ఆయన ఉన్నారు. నాలుగు దేశాల్లోని పలు లొకేషన్లలో ఈ చిత్రం షూటింగు జరుగుతుందని అలీ అబ్బాస్‌ చెప్పారు. ఇప్పటికే దుబాయి, అబుదాబీల్లో కొన్ని లొకేషన్లను ఎంపిక చేశారు.


త్వరలో జార్జియా, పొలాండ్‌లో మరికొన్ని లొకేషన్లను ఎంపిక చేసేపనిలో ఉన్నారు. ఇండియాలో ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లోని కొండ ప్రాంతాల్లో షూటింగు జరుగుతుంది. ప్రస్తుతం  కట్రీనా అంగీకరించిన ‘ఫోన్‌బూత్‌’, టైగర్‌ 3’ చిత్రాల షూటింగు పూర్తయ్యాక ‘సూపర్‌ హీరో’ చిత్రం షూటింగు ప్రారంభ మవుతుంది. అయితే ఈ చిత్రం కోసం కట్రీనా ఇప్పటికే బాడీ ప్రిపరేషన్‌ ప్రారంభించారు. వ్యాయామం, మార్షల్‌ ఆర్ట్స్‌లో కఠినమైన శిక్షణ తీసుకుంటున్నారు.

Advertisement
Advertisement