Advertisement

పంజాబీ నేర్చుకుంటున్న Katrina Kaif..?

విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ పెళ్లి బాలీవుడ్‌లో ట్రెండింగ్ టాపిక్‌గా మారింది. రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్ జిల్లాలోని సిక్స్ సెన్సెస్ ఆఫ్ ఫోర్ట్‌లో డిసెంబర్ 9న వీరి వివాహం జరగనుంది. ఈ పెళ్లికి దాదాపుగా 120మంది అతిథులుగా రాబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం కత్రినా కైఫ్ పంజాబీ నేర్చుకుంటుందని బీ టౌన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పంజాబీ కోడలిగా మారబోతుందని ఆమె సన్నిహిత వర్గాలు తెలుపుతున్నాయి.


ప్రస్తుతం కత్రినా కైఫ్ పంజాబీ నేర్చుకుంటుందని ఆమె సన్నిహిత వర్గాలు తెలుపుతున్నాయి. వ్యక్తిగతంగా ఆమె ఒక ట్యూటర్‌ని కూడా నియమించుకుందని వారు తెలుపుతున్నారు. కుటుంబంలోని అందరితో తొందరగా కలసిపోవాలంటే భాష నేర్చుకోక తప్పదని ఆమె భావిస్తుంది. విక్కీ కౌశల్ జిమ్ చేస్తన్నప్పుడు, ట్రాఫిక్‌లో ఇరుక్కున్నప్పుడు పంజాబీ పాటలన తరచుగా వింటాడని అందరికి తెలిసిందే. ప్రస్తుతం వీరి పెళ్లి ఏర్పాట్లు చాలా చురుకుగా జరుగుతున్నాయి. బాలీవుడ్ నటుడు, కమెడియన్ అయిన కృష్ణ అభిషేక్ విక్కీ కౌశల్‌కు సన్నిహిత మిత్రుడు. కృష్ణ తాజాగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పాడు. 


సవాయ్ మాధోపూర్ జిల్లా కలెక్టర్ తాజాగా పోలీస్ శాఖకు చెందిన సిబ్బందితో సమావేశమయ్యారు. పెళ్లికి  పీఎమ్‌వో అధికారులు కూడా హాజరుకాబోతుండటంతో వారు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

Advertisement

Bollywoodమరిన్ని...