బాలీవుడ్ స్టార్స్ హీరోయిన్స్‌లో ఒకరైన కత్రినా కైఫ్... కెరీర్ ప్రారంభంలో దక్షిణాదిన నందమూరి బాలకృష్ణతో `అల్లరి పిడుగు`, విక్టరీ వెంకటేశ్‌తో `మల్లీశ్వరి` చిత్రంలోనూ నటించిన సంగతి తెలిసిందే. ఈ అమ్మడు ఇప్పుడు మరో దక్షిణాది స్టార్‌తో నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సినీ వర్గాల సమాచారం మేరకు కత్రినా కైఫ్.. కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటించనున్న బాలీవుడ్ మూవీలో జోడీ కట్టనుందట. బాలీవుడ్ సూపర్‌హిట్ మూవీ `అందాధున్` దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ దర్శకుడిగా విజయ్‌సేతుపతితో ఓ సినిమాను రూపొందించనున్నాడు. ఇందులో కత్రినా కైఫ్ హీరోయిన్గా నటిస్తుందని అంటున్నారు. మరి ఇందులో నిజానిజాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగక తప్పదు.