Abn logo
Jun 11 2021 @ 18:07PM

కాంగ్రెస్‌లో వివాదాస్పదంగా మారిన కౌశిక్‌రెడ్డి వ్యవహారం

హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌లో హుజురాబాద్ కాంగ్రెస్ ఇంచార్జీ కౌశిక్‌రెడ్డి వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌తో సన్నిహితంగా మెలగడంపై కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కేటీఆర్, కౌశిక్‌రెడ్డి కలిసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది హుజురాబాద్‌లో పార్టీకి నష్టమని కాంగ్రెస్‌ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల మాజీమంత్రి ఈటల రాజేందర్‌పై కౌశిక్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. గత ఎన్నికల్లో తనను ఓడించేందుకు సొంత పార్టీ నేతలు ప్రత్యర్ధికి డబ్బులు ఇచ్చి సహాయం చేశారని ఈటల ఆరోపించారు. ఈటల ఆరోపణల ఈ నేపథ్యంలో కేటీఆర్, కౌశిక్‌రెడ్డిల సమావేశం హాట్‌హాట్‌గా మారింది. 2018లో ఈటలపై పోటీ చేసి  కౌశిక్‌రెడ్డి 60 వేల ఓట్లు సాధించారు.

Advertisement
Advertisement
Advertisement