హెచ్‌సీఏ వివాదాలకు కవిత చెక్!

ABN , First Publish Date - 2021-07-17T22:36:07+05:30 IST

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ వివాదాలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెక్‌ పెట్టారు. హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌

హెచ్‌సీఏ వివాదాలకు కవిత చెక్!

హైదరాబాద్: హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ వివాదాలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెక్‌ పెట్టారు. హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌, ఉపాధ్యక్షుడు జాన్‌ మనోజ్‌ వర్గాల మధ్య కవిత సయోధ్య కుదిర్చినట్టు తెలిసింది. హైదరాబాద్‌లోని కవిత నివాసంలో జరిగిన ఈ పంచాయితీలో అజర్‌, జాన్‌తో పాటు హెచ్‌సీఏ ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. వివాదాలు, కుమ్ములాటలు పక్కనపెట్టి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, లేదంటే ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌లో జరిగిన పరిణామాలే ఇక్కడా చవిచూడాల్సి వస్తుందని గట్టిగానే ఇరు వర్గాలకు కవిత చెప్పినట్లు తెలుస్తోంది. కోర్టుల్లో ఉన్న కేసులు, ఒకరికొకరు ఇచ్చుకున్న షోకాజ్‌ నోటీసులు అన్నీ వెనక్కి తీసుకొని క్రికెట్‌ కార్యకలాపాలను తక్షణమే పునరుద్ధరించాలని కవిత సూచించారని సమాచారం. 

Updated Date - 2021-07-17T22:36:07+05:30 IST