కాకినాడలో ‘కవి సమ్రాట్’ సినిమా ప్రివ్యూ
ABN , First Publish Date - 2021-10-18T05:47:50+05:30 IST
నగరంలోని దంటు కళాక్షేత్రంలో నటుడు ఎల్బీ శ్రీరామ్ నటించిన ‘కవి సమ్రాట్’ సినిమా ప్రివ్యూను ఆదివారం ప్రదర్శించారు. ఆయన ప్రేక్షకులతో కలిసి దీనిని వీక్షించారు. ఈ సందర్భంగా ఎల్బీ మాట్లాడుతూ చాలా రోజుల తర్వాత ప్రేక్షకులను కలవడం ఆనందంగా ఉందన్నారు.
భానుగుడి (కాకినాడ), అక్టోబరు 17: నగరంలోని దంటు కళాక్షేత్రంలో నటుడు ఎల్బీ శ్రీరామ్ నటించిన ‘కవి సమ్రాట్’ సినిమా ప్రివ్యూను ఆదివారం ప్రదర్శించారు. ఆయన ప్రేక్షకులతో కలిసి దీనిని వీక్షించారు. ఈ సందర్భంగా ఎల్బీ మాట్లాడుతూ చాలా రోజుల తర్వాత ప్రేక్షకులను కలవడం ఆనందంగా ఉందన్నారు. కళాకారులను ఆదుకునేందుకు ప్రతీ ఒక్కరూ ముందుకు రావాలన్నారు. కళపై ఆధారపడి, కళనే జీవితంగా బతుకుతున్నవారు చాలా మంది కాకినాడలో ఉన్నందుకు చాలా గర్వంగా ఉందన్నారు. లయన్స క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో లయన్స పూర్వ గవర్నర్ బాదం బాలకృష్ణ, వేలూరి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.