ఎమ్మెల్సీగా గెలుపు పత్రాన్ని అందుకున్న కవిత

ABN , First Publish Date - 2021-11-26T23:01:53+05:30 IST

ఎమ్మెల్సీగా గెలుపు పత్రాన్ని కల్వకుంట్ల కవిత అందుకున్నారు. ఇటీవల ఎమ్మెల్సీగా కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఎమ్మెల్సీగా గెలుపు పత్రాన్ని అందుకున్న కవిత

నిజామాబాద్: ఎమ్మెల్సీగా గెలుపు పత్రాన్ని కల్వకుంట్ల కవిత అందుకున్నారు. ఇటీవల ఎమ్మెల్సీగా కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నిజామాబాద్ ఎమ్మెల్సీ ఏకగ్రీవం కావడంతో కవిత ఇంటి వద్ద సంబరాలు చేసుకుంటున్నారు. ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు కవిత కృతజ్ఞతలు తెలిపారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మరోసారి ఎన్నికయ్యేందుకు సహకరించిన ప్రజాప్రతినిధులందరికీ కవిత ధన్యవాదాలు తెలిపారు. 


నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆమెకు పోటీగా దాఖలైన ఏకైన నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. నామినేషన్ల పరిశీలనలో స్వతంత్ర అభ్యర్థి శ్రీనివాస్‌ దాఖలు చేసిన నామినేషన్‌ను అధికారులు తిర్కరించారు. దీంతో పోటీలో కవిత ఒక్కరే మిగిలి ఉండడంతో.. ఏకగ్రీవంగా ఎన్నికైనట్లయింది. స్వతంత్ర అభ్యర్థి శ్రీనివాస్‌ అఫిడవిట్‌ను సక్రమంగా సమర్పించలేదని, కొన్ని వివరాలను సరిగా పొందుపరచలేదని తేల్చారు. అంతకుముందు.. శ్రీనివాస్‌ అభ్యర్థిత్వాన్ని బలపరిచిన ముగ్గురు ఓటర్లు ఆయన తమ సంతకాలను ఫోర్జరీ చేశారంటూ అధికారులకు ఫిర్యాదు చేశారు.

Updated Date - 2021-11-26T23:01:53+05:30 IST