Abn logo
Sep 22 2020 @ 21:33PM

జగనన్న స్ఫూర్తితో మీ కిరణ్ అన్న అంటూ మహిళలకు టోకరా

కృష్ణా: కైకలూరులో కేబి ఫౌండేషన్ బోర్డు తిప్పేసింది. రూ.5 వేలు చెల్లిస్తే రూ.50వేలు ఇస్తామంటూ 150 మంది మహిళల నుంచి ఏజెంట్‌ శ్యామల ద్వారా డబ్బు వసూలు చేశారు. జగనన్న స్ఫూర్తితో మీ కిరణ్ అన్న అనే బ్యానర్‌తో మహిళలకు ఎరవేశారు.  హైదరాబాద్‌కు చెందిన బొడ్డు కిరణ్ కుమార్‌పై బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
Advertisement
Advertisement