Abn logo
Apr 11 2021 @ 12:57PM

కేసీఆర్ అహంకారాన్ని తగ్గించుకోవాలి: బండి సంజయ్

హైదరాబాద్‌: సీఎం కేసీఆర్ అహంకారాన్ని తగ్గించుకోవాలని బీజేపీ నేత బండి సంజయ్ హెచ్చరించారు. బీజేపీ కార్యాలయంలో పూలే జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ కేసీఆర్‌పై మండిపడ్డారు. బీసీ అంటే.. బాయ్‌కాట్ చంద్రశేఖరరావు అనే నినాదంతో బీసీలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. మహనీయుల చరిత్రను కనుమరుగు చేసేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ నలుగురు బీసీలకు మాత్రమే మంత్రి పదవులిచ్చారని విమర్శించారు. కేసీఆర్‌ ఖాళీగానే ఉంటాడు కానీ.. మహనీయులకు నివాళులు కూడా అర్పించరని సంజయ్ తప్పుబట్టారు. 


Advertisement
Advertisement
Advertisement