అబుదాబీలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు..!

ABN , First Publish Date - 2022-02-19T02:00:26+05:30 IST

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలను అబుదాబిలో ఘనంగా జరిగాయి.

అబుదాబీలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలను అబుదాబిలో ఘనంగా జరిగాయి. హుజూర్‌నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి సూచనలతో ఈ వేడుకలను టీఆర్ఎస్ పార్టీ నేరేడుచర్ల పట్టణ అధ్యక్షురాలు, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ చల్లా శ్రీలత విజయ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించారు. అబుదాబీలో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉందని శ్రీలత పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ రథసారథి కేసీఆర్.. అభివృద్ధి ప్రదాత, దేశ రాజకీయాలకు దిక్సూచిగా అభివర్ణించారు.


 కేసీఆర్ రాష్ట్రానికే కాకుండా యావత్ దేశానికీ ఆదర్శమంటూ ప్రశంసల వర్షం కురిపించారు.  ఆయన ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని దేశ ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. బంగారు తెలంగాణాలో ప్రజలు నిరంతరం సుఖసంతోషాలతో తులతూగాలనేది కేసీఆర్ లక్ష్యమని పేర్కొన్నారు. వేడుకల సందర్భంగా అబుదాబీలోని తెలుగు వారంతా కేక్ కట్ చేశారు. ఈ వేడుకలు విజయవంతంగా జరిగేందుకు సహకరించిన వారందరికీ శ్రీలత ధన్యవాదాలు తెలియజేశారు.

Updated Date - 2022-02-19T02:00:26+05:30 IST