Abn logo
Jun 4 2020 @ 21:45PM

కేసీఆర్ దళితులను అన్ని రంగాల్లో అణిచి వేశారు: మావోయిస్టులు

ములుగు జిల్లా: కన్నాయిగూడెం మండలం బుట్టయిగూడెంలో మావోయిస్టుల లేఖల కలకలం సృష్టించింది. తెలంగాణ ప్రభుత్వం 15 నుంచి 20 ఎకరాల భూమి ఉన్న భూస్వాములకి డబ్బులు ఇస్తూ మధ్యతరగతి కుటుంబాలు, పట్టా లేని పేదలకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తానని మోసం చేసిన కేసీఆర్.. తన 7 ఏళ్ల పాలనలో దళితులను అన్ని రంగాల్లో అణిచి వేశారని మావోయిస్టులు విమర్శించారు. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ నేతలకు ప్రజలే బుద్ది చెపుతారని మావోయిస్టులు లేఖలో వెల్లడించారు. పోడుభూమి కొట్టుకున్న రైతులకు పట్టాలు ఇవ్వకుండా ప్రభుత్వం మోసం చేస్తోందని మావోయిస్టులు విమర్శించారు.

Advertisement

తెలంగాణ మరిన్ని...

Advertisement
Advertisement