కేసీఆర్ వ్యాఖ్యల్లో పాక్షిక సత్యం

ABN , First Publish Date - 2021-03-28T00:25:49+05:30 IST

కేసీఆర్ వ్యాఖ్యలు ఏపీ-తెలంగాణలో చర్చనీయాంశమయ్యాయి. అయితే కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్లో పాక్షికంగా మాత్రమే సత్యం ఉందని ఏపీ ప్రజలు చెబుతున్నారు.

కేసీఆర్ వ్యాఖ్యల్లో పాక్షిక సత్యం

హైదరాబాద్: ‘ఒకప్పుడు ఆంధ్రాలో ఒక ఎకరం భూమి అమ్మితే.. తెలంగాణలో మూడు ఎకరాలు కొనుక్కునేలా పరిస్థితి ఉండేది. కానీ, ఇప్పుడది రివర్స్‌ అయింది. తెలంగాణలో ఎకరం భూమి అమ్మితే.. ఏపీలో రెండు ఎకరాలు కొనుక్కోగలిగేలా ఇక్కడి  భూములకు డిమాండ్‌ వచ్చింది’ అని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రసంగించారు. ఇప్పుడు కేసీఆర్ వ్యాఖ్యలు ఏపీ-తెలంగాణలో చర్చనీయాంశమయ్యాయి. అయితే కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్లో పాక్షికంగా మాత్రమే సత్యం ఉందని ఏపీ ప్రజలు చెబుతున్నారు. ఇదే విషయాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించితే స్పష్టమవుతుందని చెబుతున్నారు. నిన్న కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్లో ఒక అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే.. తెలంగాణలో ఒక ఎకరం భూమి అమ్మితే ఏపీలోని ప్రకాశం జిల్లాలోని కనిగిరి, ఎర్రగొండపాలెం ప్రాంతాల్లో మాత్రమే రెండు ఎకరాలు కొనే పరిస్థితి ఉందని అంటున్నారు. ఈ స్థితి మిగతా జిల్లాల్లో లేదని వాదిస్తున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాలో పాటు కొస్తాంధ్ర జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో గతంలో భూమలు రేట్లు బాగా పెరిగిన మాట వాస్తవమేని చెప్పారు. 


అయితే పరిపాలన వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులు చేయాలని ప్రభుత్వం అనుకుంటోంది. దీంతో రియల్ ఎస్టేట్ భూం అమాంతం పడిపోయిందని పేర్కొంటున్నారు. కానీ ఆ రోజు ఉన్న ధరతో పొల్చితే.. ఇప్పుడు ఉన్న ధరకు భూములు అమ్మే పరిస్థితులు లేవని చెబుతున్నారు. ధరలు తగ్గడంతో కొనుగోలు దారులు వస్తున్నారని, అమ్మడానికి మాత్రం రైతులు సిద్ధంగా లేరని పేర్కొంటున్నారు. ఉదాహరణకు గతంలో రాజధాని ప్రాంతంతో గజం స్థలం 30 వేల రూపాయల నుంచి 40 వేల రూపాయలు పలికింది. ప్రస్తుతం 10 వేల నుంచి 20 వేల రూపాయల మధ్యలో ఉంది. ఇది కూడా ఆయా ప్రాంతాలను బట్టి మాత్రమే ఈ ధర ఉంది. అయితే వ్యవసాయ భూముల ధర మాత్రం.. కేసీఆర్ చెప్పిన స్థాయిలో తగ్గలేదని, సాగు నీరు సరిగ్గాలేని ప్రాంతాల్లో మాత్రమే కేసీఆర్ చెప్పినట్లు భూములు ధరలు తగ్గుముఖం పట్టాయని తెలిపారు. కేసీఆర్ చెప్పిన మాటల్లో మరో వాస్తవం లేకపోలేదు. ఎలాగంటే రాజధాని విషయంలో విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోంది. మూడు రాజధానుల ప్రకటనతో ఇక్కడ ఉన్న రియల్టర్ హైదరాబాద్‌కు తరలిపోయారు. అందువల్లే హైదరాబాద్ పరిసరప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ భూం వచ్చిందని చెబుతున్నారు. 

Updated Date - 2021-03-28T00:25:49+05:30 IST