కేసీఆర్‌ నిర్ణయాలే రాష్ట్ర అభివృద్ధికి ఆటంకాలు

ABN , First Publish Date - 2020-05-22T10:18:41+05:30 IST

కేసీఆర్‌ అనా లోచిత నిర్ణయాలే రాష్ట్ర అభివృద్దికి ఆటంకాలుగా మారాయని పీసీసీ ఛీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నా రు. ఆయన

కేసీఆర్‌ నిర్ణయాలే రాష్ట్ర అభివృద్ధికి ఆటంకాలు

కరోనా టెస్టులు చేయడంలో ప్రభుత్వం విఫలం

పీసీసీ ఛీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి 


జగిత్యాల, మే 21 (ఆంధ్రజ్యోతి): కేసీఆర్‌ అనా లోచిత నిర్ణయాలే రాష్ట్ర అభివృద్దికి ఆటంకాలుగా మారాయని పీసీసీ ఛీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నా రు. ఆయన అవలంబిస్తున్న విధానాలు తుగ్లక్‌ పాలనను తలపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి నివాసంలో వి లేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. దేశం లో, రాష్ట్రంలో ఎక్కడా సరిగా కరోనా టెస్టులు చేయ డం లేదనీ, దేశ వ్యాప్తంగా మిలియన్‌ మంది జనాభాకు 16వేల మందికి టెస్టులు చేశారనీ, రాష్ట్రంలో ఇదే మిలియన్‌ జనాభాకు కేవలం 650 మందికి మా త్రమే టెస్ట్‌లు చేశారని అన్నారు. పక్క రాష్ట్రాల్లో 2 నుంచి 3లక్షల టెస్ట్‌లు నిర్వహిస్తున్నాయని గుర్తు చే శారు. మే 14 వరకు తెలంగాణ రాష్ట్రంలో కేవలం 22వేల టెస్ట్‌లు నిర్వహించారన్నారు. ఇదే విషయం లో వాస్తవాలను గవర్నర్‌కు నివేదిస్తే, సీఎం స్థాయి లో ఉండి ప్రతి పక్షాలను తిట్టాడన్నారు. 


వలస కూలీల లెక్కల్లో స్పష్టత లేదు

వలస కూలీల లెక్కలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేకపోవడం సిగ్గుచేటని, సీఎంకు, అధికారులకు మ ధ్య సమన్వయ లోపం కారణంగానే వలస కూలీల విషయంలో కేసీఆర్‌ విఫలం అయ్యారని ఆరోపించా రు. సీఎం రిలీప్‌ ఫండ్‌ స్పష్టత విషయంలో కేసీ ఆర్‌ మౌనం ఎందుకు వహించారో చెప్పాలని ఉత్తమ్‌ డి మాండ్‌ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో ఉందంటే, దానికి కారణం కరోనా కాదనీ, గత ఆరే ళ్లుగా కేసీఆర్‌ తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలేనని దుయ్యబట్టారు. ప్రతి గింజ కొనుగోలు చేస్తామ న్న ప్రభుత్వం నేటికీ యాభైశాతం వరిధాన్యం కొనుగోలు చేయలేదన్నారు. రైతు బంధులో మోసం, రుణ మాఫీలో స్పష్టత లేదని విమర్శించారు. గల్ఫ్‌ కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ఈ విష యంలో ప్రభుత్వం ఉన్న పెద్దలకు సిగ్గు ఉండాలని అన్నారు. క్వారంటైన్‌లో గల్ఫ్‌ కార్మికుల వద్ద ఛార్జీలు వసూలు చేయడం దుర్మార్గం అని, రాష్ట్ర ప్రభుత్వమే కార్మికుల క్వారంటైన్‌ ఛార్జీలు చెల్లించాలని ఉత్తమ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.


పత్తిపంటకు కనీసం క్వింటాలుకు రూ. 7వేలు ప్రకటించాలని పేర్కొన్న ఆయన మూడు మాసాలు గా కంది పంట డబ్బులు రాలేదని అన్నారు. ఈ పరిస్థితి ఇలా ఉంటే నూతన వ్యవసాయ విధానంకు రైతులు ఎలా ఆమోదం తెలుపుతారని అన్నారు. ఈసమావేశంలో ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌, జిల్లా అధ్య క్షుడు అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌,  ఆది శ్రీనివాస్‌, మేడిపెల్లి సత్యం, గిరి నాగభూషణం, విజయలక్ష్మీ, బండ శంకర్‌, కొత్త మోహన్‌, గుంటి జగదీశ్వర్‌ పాల్గొన్నారు.


Updated Date - 2020-05-22T10:18:41+05:30 IST