Abn logo
Jan 26 2021 @ 00:31AM

కేసీఆర్‌ పట్టుదలతోనే అభివృద్ధి

రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పనాశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి


ఘట్‌కేసర్‌: సీఎం కేసీఆర్‌ పట్టుదలతోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పనాశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్‌ జిల్లా పోచారం మున్సిపాలిటీలోని పలువార్డుల్లో రూ.79.50లక్షలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు మంత్రి సోమవారం శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానంగా భూగర్భ మురుగుకాల్వలు, రోడ్లు, పార్కుస్థలాల అభివృద్ధి, కమ్యూనిటీ భవనాల నిర్మాణం, వైకుంఠధామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు వివరించారు. గతంలో తాగు, సాగు నీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడాలేని సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం ముందుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ కొండల్‌రెడ్డి, వైస్‌చైర్మన్‌ నానావత్‌ రెడ్డియానాయక్‌, కమిషనర్‌ సురేష్‌. కౌన్సిలర్లు ధనలక్ష్మీ, రాజశేఖర్‌, సాయిరెడ్డి, వెంకటేష్‌, బాల్‌రెడ్డి, హరిప్రసాద్‌రావు, పోచమ్మ, మమత, శ్రీలత, కోఆప్షన్‌ సభ్యులు అక్రంఅలీ, శంకుంతల, నాయకులు సురేందర్‌రెడ్డి, జగన్‌ మోహన్‌రెడ్డి, శ్రీశైలం, శ్రీనివాస్‌, బుచ్చిరెడ్డి పాల్గొన్నారు. 

Advertisement
Advertisement