Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 21 2021 @ 15:26PM

కేసీఆర్ ధర్నా చేస్తే మోదీకి జ్ఞానోదయం అయ్యిందా?: పొన్నాల

హైదరాబాద్: సీఎం కేసీఆర్ ధర్నా చేస్తే మోదీకి జ్ఞానోదయం అయ్యిందా? అని పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ఫసల్ బీమా డబ్బులు ఎందుకివ్వడం లేదని నిలదీశారు. బ్రతకడానికి బీమా ఇవ్వమంటే.. చనిపోయాక బీమా ఇస్తారా?.. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులను కేసీఆర్ ఏనాడైనా పరామర్శించారా?  అని ప్రశ్నించారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయమంటే చేశారా అని నిలదీశారు. తెలంగాణ అమరులను ఆదుకునే ప్రక్రియ పూర్తయిందా?.. సమగ్ర కుటుంబ సర్వే లెక్కలను కేసీఆర్ ఎందుకు బయటపెట్టలేదు? అని పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు.

Advertisement
Advertisement