కేసీఆర్‌కు నల్లగొండ వచ్చే ముఖం లేదు : మాదగోని

ABN , First Publish Date - 2021-01-16T06:07:30+05:30 IST

నల్లగొండను దత్తత తీసుకొని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని చెప్పి ముఖం చాటేసిన సీఎం కేసీఆర్‌ కు ఇక్కడికొచ్చే ముఖంలేదని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివా్‌సగౌడ్‌ ఆరోపించారు.

కేసీఆర్‌కు నల్లగొండ వచ్చే ముఖం లేదు : మాదగోని
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న శ్రీనివాస్‌గౌడ్‌

రామగిరి, జనవరి 15 : నల్లగొండను దత్తత తీసుకొని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని చెప్పి ముఖం చాటేసిన సీఎం కేసీఆర్‌ కు ఇక్కడికొచ్చే ముఖంలేదని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివా్‌సగౌడ్‌ ఆరోపించారు. శుక్రవారం ఆయన స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. శాసనసభ ఎన్నికల్లో భాగంగా సీఎం కేసీఆర్‌ నల్లగొండకు వచ్చిన సందర్భంగా  ఆయన నల్లగొండను దత్తత తీసుకొని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి బంగారు నల్లగొండ మారుస్తానని ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ప్రాజెక్టు వద్ద కుర్చీ వేసుకొని పనులు పూర్తి చేస్తానని మరిచాడన్నారు. ఈ ఈఈ నేపథ్యంలో నేడు కేసీఆర్‌కు నల్లగొండకు వచ్చే ముఖం లేకనే  కొడుకు కేటీఆర్‌ను జిల్లాకు పంపిస్తున్నాడన్నారు. ప్రస్తుతం సాగర్‌ ఉప ఎన్నికల నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో గొర్రెల పంపిణీ  కార్యక్రమం చేపడుతున్నారని ఆరోపించారు. ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తున్న గొర్రెలకు ఇక్కడి వాతావరణ పరిస్థితులు అ నుకూలించక ఎన్నో గొర్రెలు మృత్యువాత పడుతున్నాయన్నారు.  దీంతో గొర్రెల కాపరులకు రూ.1.50లక్షలు బ్యాంకు ఖాతాలో  నేరు గా జమ చేయాలని డిమాండ్‌ చేశారు. సిరిసిల్ల గజ్వేల్‌ మాదిరిగా నల్లగొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని డిమాండ్‌ చేశారు. నల్గొండ చీకటి లోమగ్గి పోతుంటే ఇక్కడి టిఆర్‌ఎస్‌ నాయకులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక్కడి టీఆర్‌ఎస్‌ నాయకులకు నల్గొండను ఐటి హబ్‌ గా ప్రకటించేలా కేటీఆర్‌ ను కోరాలని డిమాండ్‌ చేశారు. నల్లగొండను  ఐటీ హబ్‌ గా ప్రకటించి ఆరు నెలల్లోగా పనులు ప్రారంభించాలని కోరారు.  ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు పల్లెబోయిన శ్యామ్‌ సుందర్‌, బండారు ప్రసాద్‌, నూకల వెంకట్‌ నారాయణరెడ్డి, జిల్లా నాయకులు చింత ముత్యాల రావు, పొగాకు నాగరాజు, చర్లపల్లి గణేష్‌ , సాయిరాం కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-01-16T06:07:30+05:30 IST