రైతును రాజుగా చూడాలనేది కేసీఆర్‌ కల

ABN , First Publish Date - 2020-05-26T05:30:00+05:30 IST

రైతును రాజుగా చేయడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని ఎమ్మెల్యే రాములునాయక్‌ అన్నారు

రైతును రాజుగా చూడాలనేది కేసీఆర్‌ కల

వైరా ఎమ్మెల్యే రాములునాయక్‌


కొణిజర్ల, మే 25: రైతును రాజుగా చేయడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని ఎమ్మెల్యే రాములునాయక్‌ అన్నారు. కొణిజర్లలోని సహకార పరపతి సంఘంలో సోమవారం మార్క్‌ఫెడ్‌ వైస్‌చైర్మన్‌ బొర్రా రాజశేఖర్‌తో కలిసి జీలుగులు పంపిణిని ప్రారంభించారు. అనంతరం సొసైటీ చైర్మన్‌ చెరుకుమల్లి రవి అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం సూచిస్తున్న పంటలను, పంటమార్పిడి విధానాన్ని రైతులు అమలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కొణిజర్ల సర్పంచ్‌ సూరంపల్లి రామారావు, వైరా ఏఎంసీ చైర్మన్‌ గుమ్మా రోశయ్య, రైతు  బంధు సమితి మండల కన్వీనర్‌ దొడ్డపినేని రామారావు, ఎంపీపీ గోసు మధు, తహసీల్దార్‌ దామోదర్‌, ఎంపీడీవో రమాదేవి, ఏవో బాలాజి, ఎస్‌ఐ మొగిలి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్ష, కార్యదర్శులు కోసూరి శ్రీనివా్‌సరావు, ఏలూరు శ్రీనువా్‌సరావు, చల్లా మోహన్‌రావు, రాయల పుల్లయ్య, సొసైటీ డైరక్టర్‌లు పాల్గొన్నారు. 


ప్రభుత్వం సూచించిన పంటలను సాగుచేయాలి

ఎర్రుపాలెం: ప్రభుత్వం సూచించిన పంటలను సాగుచేసి అధిక ఆదాయాన్ని పొందాలని సీడ్స్‌ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు, జడ్పీచైర్మన్‌ లింగాల కమలరాజు రైతులను కోరారు. సోమవారం మండలంలోని తక్కెళ్లపాడు సొసైటీ కార్యాలయంలో జరిగిన రైతు సదస్సులో వారు పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వం సూచించిన పంటలను వేయకుంటే రైతుబంధు వర్తించదని తెలిపారు. అనంతరం రైతులకు జీలుగు విత్తనాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ చావా రామకృష్ణ, డీసీసీబీ డైరెక్టర్‌ అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, ఎంపీపీ దేవరకొండ శిరీష, జడ్పీటీసీ శీలం కవిత, రైతుబంధు కన్వీనర్‌ శీలం వెంకట్రామిరెడ్డి, త్రివేణి, రామకోటయ్య, సొసైటీ అధ్యక్షుడు అనుమోలు సాంబశివరావు, సర్పంచ్‌లు కూరపాటి సుందరమ్మ, అప్పారావు, ఏవో విజయభాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.


రఘునాథపాలెం: మండలంలోని చిమ్మపుడి, జీకే బంజర, కోటపాడు, చింతగుర్తి గ్రామాల్లో రైతు అవగాహన సదస్సులు జరిగాయి. చిమ్మపుడి గ్రామంలో జరిగిన సమావేశంలో ఎంపీపీ గుత్తా రవికుమార్‌ మాట్లాడారు. మాట్లాడారు. లాభదాయకపంటలను సాగు చేయాలన్నారు. ఈకార్యక్రమంలో సర్పంచ్‌లు గొర్రె కృష్ణవేణి, పిన్ని సరిత బాతుల రమణ, మెంటెం రామారావు, ఏవో భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు. 


ఏన్కూరు: మడలంలోని సూర్యాతండా, శ్రీరాంగిరి, జన్నారం ఎస్సీ కాలనీ తదితర గ్రామాల్లో  అవగాహన సదస్సులు జరిగాయి. ఏవో నర్సింహారావు, రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్‌ వై.మోహన్‌రావు, సర్పంచ్‌లు విజయకుమారి, నర్సింహారావు, బానోతు ఘంసీ, ఏఈవోలు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-26T05:30:00+05:30 IST