Advertisement
Advertisement
Abn logo
Advertisement
Aug 19 2021 @ 19:46PM

కేసీఆర్ పిచ్చి పనులు చేస్తే సహించం: ఈటల

కరీంనగర్‌: రాష్ట్ర ఆదాయంపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని మాజీమంత్రి ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వెలమలకి నాలుగు పదవులు ఇచ్చి.. దళితులకు ఒక్క పదవా? అని ప్రశ్నించారు. సీఎంవోలో ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ అధికారి కూడా లేరని విమర్శించారు. దళిత బంధుపై ఓపెన్ డిబేట్‌కు ప్రభుత్వం సిద్ధమా? అని ఈటల ప్రశ్నించారు. సర్వేల్లో సీఎం కేసీఆర్‌ పని తీరు బయట పడిందన్నారు. సోషల్ మీడియాలో మాట్లాడుతున్న వారిని బెదిరిస్తే తిరుగుబాటు చేస్తారనా, రాజకీయాల్లో లెఫ్టూ.. రైటూ ఉండవన్నారు. సీఎం కేసీఆర్ పిచ్చి పనులు చేస్తే సహించమని ఈటల రాజేందర్ హెచ్చరించారు.

Advertisement
Advertisement