కేసీఆర్‌ కుటుంబం జైలుకు వెళ్లడం ఖాయం

ABN , First Publish Date - 2021-04-19T06:00:28+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబం జైలుకు వెళ్లడం ఖాయమని, నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నా ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ఇటీవల రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కోనరావుపేట మండలం వట్టిమల్ల గొల్లపల్లిలో ఉద్యోగం రావడం లేదని ఆత్మహత్య చేసుకున్న ముచ్చర్ల మహేందర్‌యాదవ్‌ కుటుంబాన్ని ఆదివారం పరామర్శించారు.

కేసీఆర్‌ కుటుంబం జైలుకు వెళ్లడం ఖాయం
మహేందర్‌యాదవ్‌ చిత్ర పటం వద్ద నివాళులు అర్పిస్తున్న బండి సంజయ్‌

- నిరుద్యోగులకు భరోసా ఏదీ?

- నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నా పట్టించుకోరా?

- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ 

కోనరావుపేట, ఏప్రిల్‌ 18: ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబం జైలుకు వెళ్లడం ఖాయమని, నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నా ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ఇటీవల రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కోనరావుపేట మండలం వట్టిమల్ల గొల్లపల్లిలో ఉద్యోగం రావడం లేదని ఆత్మహత్య చేసుకున్న ముచ్చర్ల మహేందర్‌యాదవ్‌ కుటుంబాన్ని ఆదివారం పరామర్శించారు. మహేందర్‌యాదవ్‌ చిత్రపటం వద్ద నివాళి అర్పించారు.  అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నీళ్లు, నిధులు, కొలువులు వస్తాయన్న కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత మర్చిపోయారన్నారు. నిరుద్యోగభృతి ఇచ్చి భరోసా నింపాల్సిన ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కుటుంబం దోచుకుంటోందన్నారు. రానున్న కాలంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, అప్పుడు వారు జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు. కాగజ్‌నగర్‌లో అరెస్ట్‌ చేసిన హరీష్‌బాబును వెంటనే విడుదల చేయాలన్నారు. తెలంగాణలో రాచరిక పాలన కొనసాగుతోందన్నారు.  ఆయన వెంట జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, నాయకులు ఉన్నారు. 

Updated Date - 2021-04-19T06:00:28+05:30 IST