Abn logo
Sep 24 2021 @ 16:52PM

ఢిల్లీకి బయల్దేరిన కేసీఆర్

హైదరాబాద్‌: ఢిల్లీకి సీఎం కేసీఆర్ బయల్దేరారు. సీఎంతో పాటు ఢిల్లీకి సీఎస్‌ సోమేష్‌కుమార్‌, ఎంపీ సంతోష్‌కుమార్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ వెళ్లారు. ఈ నెల 1న ఢిల్లీకి వెళ్లిన సీఎం కేసీఆర్‌ ప్రధాని మోదీని, కేంద్ర మంత్రులు అమిత్‌షా, షెకావత్‌, గడ్కరీలను కలిశారు. 8 రోజుల పాటు అక్కడే ఉన్నారు. ఈసారి మూడు రోజుల పర్యటనపై వెళుతున్నారు. 25న జల వనరుల మంత్రితో సమావేశం అవుతారు. 26న నక్సల్స్‌ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో హోంమంత్రి అమిత్‌షా ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం పాల్గొంటారు. ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్ర ఆహార, పౌర సరఫరాల మంత్రి పీయూష్‌ గోయెల్‌తో భేటీ అవుతారు. సాయంత్రం హైదరాబాద్‌కు తిరిగి వస్తారు. 

ఇవి కూడా చదవండిImage Caption