మాటల గారడీతో కేసీఆర్‌ మోసం

ABN , First Publish Date - 2021-10-18T06:27:12+05:30 IST

మాటల గారడీతో సీఎం కేసీఆర్‌ మోసం చేస్తున్నారని నల్లగొండ ఎంపీ నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం డిండి మండలం శేషాయికుంట గ్రామంలో వివేకానందుడి విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు.

మాటల గారడీతో కేసీఆర్‌ మోసం
విగ్రహావిష్కరణ అనంతరం మాట్లాడుతున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

త్వరలో రాహుల్‌ గాంధీకి ఏఐసీసీ బాధ్యతలు

నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి


డిండి, అక్టోబరు 17: మాటల గారడీతో సీఎం కేసీఆర్‌ మోసం చేస్తున్నారని నల్లగొండ ఎంపీ నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం డిండి మండలం శేషాయికుంట గ్రామంలో వివేకానందుడి విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. యువత వివేకానందుడిని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు ఐక్యంగా ఉండాలని, నిజాయితీతో పనిచేసే నాయకులు, కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. అఖిల భారత కాంగ్రెస్‌ అధ్యక్ష పదవిని త్వరలో రాహుల్‌గాంధీ చేపట్టనున్నారని, దీంతో కాంగ్రెస్‌ పార్టీ మరింత బలోపేతమవుతుందన్నారు. దళితులకు 17శాతం, గిరిజనులకు 12శాతం రిజర్వేషన్లు కల్పిస్తానని సీఎం కేసీఆర్‌ మోసం చేశారన్నారు. పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఒక్కరు సైతం రిజర్వేషన్లపై మాట్లాడలేదన్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక కోసమే కేసీఆర్‌ దళితబంధు తెచ్చారని విమర్శించారు. కొవిడ్‌తో మృతి చెందిన వివేకానంద యువజన గ్రామ అధ్యక్షుడు వరికుప్పల బాబు కుటుంబానికి కాంగ్రెస్‌ నాయకుడు నేనావత్‌ కిషన్‌నాయక్‌ రూ. 50వేల ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌, మాజీ ఎమ్మెల్యే నేనావత్‌ బాలూనాయక్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు నల్లవెల్లి రాజే్‌షరెడ్డి, నేనావత్‌ కిషన్‌నాయక్‌, వేణుధర్‌రెడ్డి, ఏవీఎన్‌రెడ్డి, ఎంపీటీసీ స్వాతి రాజే్‌షరెడ్డి, సర్పంచ్‌ వంకేశ్వరం అలివేలు, రేఖారెడ్డి, వెంకటరమణరెడ్డి, లక్‌పతినాయక్‌, రేక్యానాయక్‌, గుంజ రేణుక పాల్గొన్నారు.

Updated Date - 2021-10-18T06:27:12+05:30 IST