Advertisement
Advertisement
Abn logo
Advertisement
Oct 11 2021 @ 20:30PM

పేదల పక్షపాతి కేసీఆర్‌: గంగుల కమలాకర్‌

హుజూరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేదల పక్షపాతి అని మంత్రి గంగుల కమలాకర్‌ కొనియాడారు. సోమవారం కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో గొల్ల, కురుమలతో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి గుంగుల మాట్లాడుతూ అబద్ధపు మాటలు చెప్పడం, ప్రజలను మోసం చేయడమే బీజేపీ నాయకుల లక్ష్యమన్నారు. బీజేపీ ప్రభుత్వం ఒక్క పథకమైనా పేదలకు ఉపయోగపడేలా రూపొందించిందా అని ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ విధానాల వల్ల సామాన్యుడిపై భారం పడుతోందని చెప్పారు. ఈటల రాజేందర్‌ రాజీనామా తరువాత హుజూరాబాద్‌ నియోజకవర్గంలో అభివృద్ధిలో పరుగులు పెడుతుందని తెలిపారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని నిరుపేదలకు త్వరలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు పూర్తి చేసి అందజేస్తామని గంగుల కమలాకర్ ప్రకటించారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement