Advertisement
Advertisement
Abn logo
Advertisement

కేసీఆర్‌ ప్రభుత్వం పతనంకాక తప్పదు

- సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కలవేన శంకర్‌

పెద్దపల్లి, నవంబర్‌ 30 (ఆంధ్రజ్యోతి): రైతులతో చెలగాటం ఆడుతున్న కేసీఆర్‌ ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో పతనం కాక తప్పదని  సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కలవేన శంకర్‌ అన్నారు. మంగళవారం పెద్దపల్లిలో సీపీఐ జిల్లా కౌన్సిల్‌ సమావేశం లక్ష్మన్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా శంకర్‌ మాట్లాడుతూ ధాన్యం కొను గో లు చేసే విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసు కుం టూ ధర్నాలు చేస్తున్నారని అన్నారు. వరి పంట వేస్తే ఉరేనని చెప్పిన ప్రభు త్వాన్ని చూడలేదన్నారు. ఈ రెండు ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలను అవలంబి స్తున్నదన్నారు. కేంద్రం తీసుకవచ్చిన మూడు వ్యవసాయ చట్టాల రద్దు కోసం రైతు లు ఉద్యమిస్తే కేంద్రం దిగి వచ్చిందన్నారు. ఇది రైతుల విజయమని అన్నారు. కనీ స మద్దతు ధరలపై చట్టం తీసుకరావాలని, విద్యుత్‌ సంస్కకణల చట్టాలను కూడా రద్దు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, రాష్ట్ర సమితి సభ్యు లు గౌతమ్‌ గోవర్దన్‌, మోహన్‌, జిల్లా కౌన్సిల్‌ సభ్యులు కనకరాజు, మల్లయ్య, సునీ ల్‌, దినేష్‌, లక్ష్మీనారాయణ, శంకర్‌, రమేష్‌, రాజమొగిలి, ప్రమీల, ఓదమ్మ, లెనిన్‌, సదానందం, తదిత రులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement