కేసీఆర్‌ది మోసపూరిత పాలన

ABN , First Publish Date - 2022-01-26T06:52:46+05:30 IST

రాష్ట్రంలో కేసీఆర్‌ మోసపూరిత పాలన కొనసాగిస్తున్నారని కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి గీతారెడ్డి అన్నారు. దేవరకొండలో మంగళవారం నిర్వహించిన కాంగ్రెస్‌ డిజిటల్‌ సభ్యత్వ నమోదును ప్రారంభించి మాట్లాడారు.

కేసీఆర్‌ది మోసపూరిత పాలన
దేవరకొండలో సమావేశంలో మాట్లాడుతున్న గీతారెడ్డి, చిత్రంలో ఉత్తమ్‌ తదితరులు

రానున్న ఎన్నికల్లో కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రె్‌సదే అధికారం

రికార్డు స్థాయిలో సభ్యత్వాలు నమోదు చేయాలి 

కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీమంత్రి గీతారెడ్డి


దేవరకొండ, జనవరి 25: రాష్ట్రంలో కేసీఆర్‌ మోసపూరిత పాలన కొనసాగిస్తున్నారని కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి గీతారెడ్డి అన్నారు. దేవరకొండలో మంగళవారం నిర్వహించిన కాంగ్రెస్‌ డిజిటల్‌ సభ్యత్వ నమోదును ప్రారంభించి మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి  రావడంఖాయమని, అందుకుగాను కార్యకర్తలు రికార్డుస్థాయిలో డిజిటల్‌ సభ్యత్వాలు నమోదు చేయాలన్నారు. వెన్నుపోటుదారులను సహించేదిలేదని, కార్యకర్తల పనితనం సోనియాగాంధీ, రాహుల్‌గాంధీల నోటీసులో ఉంటుందన్నారు. దేశంలోనే రికార్డుస్థాయిలో నల్లగొండ పార్లమెంట్‌లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సభ్యత్వ నమోదు చేయించారని ప్రశంసించారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం, తెలంగాణలోని కేసీఆర్‌ ప్రభుత్వం ప్రజలహామీలను విస్మరించి మోసపూరిత పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ సోనియాగాంధీ వల్లనే తెలంగాణ వచ్చిందని, రాజకీయంగా నష్టపోయినప్పటికీ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన గొప్ప వ్యక్తి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాళేశ్వరంపై ఉన్న ప్రేమ ఎస్‌ఎల్‌బీసీ, డిండి ప్రాజెక్టులపై లేదన్నారు. డిండి, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టులకు రూ.3వేల కోట్లు కేటాయించి పూర్తి చేయాలని ఎమ్మెల్సీ గుత్తాసుఖేందర్‌రెడ్డి ఎందుకు అడగలేదన్నారు. దేవరకొండ నియోజకవర్గానికి జడ్పీ నిధుల నుంచి వివిధ అభివృద్ధి పనులకు రూ.కోటి కేటాయిస్తున్నట్లు ఉత్తమ్‌ తెలిపారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బాలునాయక్‌, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నాయక్‌, డాక్టర్‌ వేణుధర్‌రెడ్డి, సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు జూలూరి ధనలక్ష్మీ, జాల నర్సింహరెడ్డి, సిరాజ్‌ఖాన్‌, మాధవరెడ్డి, లోకసాని శ్రీధర్‌రెడ్డి, దూదిపాల రేఖ శ్రీధర్‌రెడ్డి, కొర్ర రాంసింగ్‌, యూనుస్‌, ఏవిరెడ్డి, సతీ్‌షరెడ్డి పాల్గొన్నారు.  


కాంగ్రెస్‌ కార్యకర్తలు కష్టపడాలి: గీతారెడ్డి 

హాలియా: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గీతారెడ్డి అన్నారు. హాలియాలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో జరిగిన నాగార్జునసాగర్‌ నియోజకవర్గ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ సీఎల్‌పీ నేత కుందూరు జానారెడ్డిలతో కలిసి పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో సీఏం కేసీఆర్‌ ప్రజావ్యతిరేక పాలన కొనసాగిస్తున్నారన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు బూత్‌ లెవల్‌లో కార్యకర్తలు బలంగా కృషి చేయాలన్నారు. అనంతరం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డిలు మాట్లాడుతూ సభ్యత్వ నమోదులో నాగార్జునసాగర్‌ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మొదటిస్థానంలో ఉంచాలన్నారు.  సమావేశంలో కాంగ్రెస్‌ జిల్లా పార్టీ అధ్యక్షుడు కేతావత్‌ శంకర్‌నాయక్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు కర్నాటి లింగారెడ్డి, బీఎల్‌ఆర్‌, కాకునూరి నారాయణగౌడ్‌, చింతల చంద్రారెడ్డి, వెంపటి శ్రీనివాస్‌, సైదయ్యబాబు, గౌని రాజారమే్‌షయాదవ్‌,  పొదిల కృష్ణ, జూపల్లి శ్రీనివాస్‌, తక్కెలపల్లి సైదులు, వర్కాల శ్రీనివా్‌సరెడ్డి, శాగం పెద్దిరెడ్డి, రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు.  

Updated Date - 2022-01-26T06:52:46+05:30 IST