ప్రజల సంక్షేమానికి కేసీఆర్‌ పెద్దపీట

ABN , First Publish Date - 2022-01-20T06:47:17+05:30 IST

ప్రజల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ పెద్దపీట వేస్తున్నారని, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తున్నారని జడ్పీ చైర్‌ పర్సన్‌ న్యాలకొండ అరుణ అన్నారు.

ప్రజల సంక్షేమానికి కేసీఆర్‌ పెద్దపీట
సమావేశంలో మాట్లాడుతున్న జడ్పీచైర్‌పర్సన్‌ అరుణ

 వేములవాడ టౌన్‌, జనవరి 19 : ప్రజల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ పెద్దపీట వేస్తున్నారని, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తున్నారని జడ్పీ చైర్‌ పర్సన్‌ న్యాలకొండ అరుణ అన్నారు. వేములవాడ మండల కేంద్రంలోని స్థానిక సినారె కళామందిర్‌లో బుధవారం అలింకో సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులు, వయోవృద్ధులకు ఉపకరణాల ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీ నుంచి 25 వరకు శిబిరం నిర్వహించనున్నట్లు చెప్పారు. దివ్యాంగులు, వయో వృద్ధులు పరికరాలను పొందాలని సూచించారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత వృద్ధులకు రూ.2016, దివ్యాంగులకు రూ. 3016 పింఛన్‌ ఇవ్వడం చరిత్రలో మరిచిపోలేనిదన్నారు. మంత్రి కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా గిఫ్ట్‌ ఏ స్మైల్‌ కార్యక్రమంలో దివ్యాంగులకు ట్రై  మోటారు వాహనాల  పంపిణీ గొప్పవిషయమన్నారు.   స్థానిక ఎ మ్మెల్యే రమేష్‌బాబు వేములవాడ నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రామతీర్థపు మాధవి, ఎంపీపీ బూర వజ్రవ్వబాబు, బండ మల్లేశం, జడ్పీటీసీలు మ్యాకల రవి, ఏశ వాణితిరుపతి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గడ్డం హన్మాండ్లు, స్థానిక కౌన్సిలర్‌ అన్నారం ఉమా శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-20T06:47:17+05:30 IST