కేసిఆర్‌ భరించలేని ఒత్తిడి తెస్తుండు..

ABN , First Publish Date - 2021-10-15T06:43:30+05:30 IST

ముఖ్యమంత్రి కేసిఆర్‌ భరించలేని ఒత్తిడి తీసుకు వస్తున్నాడని మాజీ మంత్రి, బీజేపి నేత ఈటల రాజేందర్‌ అన్నారు.

కేసిఆర్‌ భరించలేని ఒత్తిడి తెస్తుండు..
సమావేశంలో మాట్లాడుతున్న ఈటల రాజేందర్‌

- హుజూరాబాద్‌లో విచ్చల విడిగా డబ్బులు ఖర్చు చేస్తున్నారు

- మాజీ మంత్రి, బీజేపి నేత ఈటల రాజేందర్‌ 


జమ్మికుంట, అక్టోబరు 14: ముఖ్యమంత్రి కేసిఆర్‌ భరించలేని ఒత్తిడి తీసుకు వస్తున్నాడని మాజీ మంత్రి, బీజేపి నేత ఈటల రాజేందర్‌ అన్నారు. గురువారం పట్టణంలోని నివాసంలో ఆటో సంఘ నాయకులతో ఈటల రాజేందర్‌ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ కేసిఆర్‌ దుష్ట రాజకీయాన్ని బొంద పెట్టాలన్నారు. ఎవరు అక్రమాలు చేశారు, దుర్మర్గాలు చేశారు, అక్రమంగా సంపాదించారు, ముందు ముందు సమాజం తెలుస్తుందన్నారు. హుజూరాబాద్‌ విష వలయంలో చిక్కుకుందని, మానవ సంభందాలను ప్రశ్నిస్తుందన్నారు. ఈ వ్యవస్థ ఎటో పోతుందని, గాడిన పెట్టాల్సింది మనమే అన్నారు. ప్రజల అవసరాల కోసం పని చేశాను తప్ప, నా అవసరాల కోసం ఎప్పుడు పని చేయలేదన్నారు. ఇన్ని సంవత్సరాల్లో ఏ ఒక్క ఎన్నికకు కూడ ఒక్క రూపాయి ఖర్చు చేయలేదన్నారు. చివరి రక్తం బొట్టు వరకు పోరాడుతా అని, ఎట్టి పరిస్థితుల్లో మోకరిల్లను అన్నారు. నేను వ్యవస్థతో కొట్లాడుతున్న, వాళ్లది అక్రమ సాంపాదన, వేల కోట్ల రూపాయాలు జమ చేసుకోని ఇష్టం వస్తున్నట్లు వ్యవహరిస్తున్నారని తెలిపారు. నన్ను కాపాడండి మిమ్మల్ని నేను కాపాడుకుంటా అన్నారు. నిజమైన ఆటో సంఘం వారికి సహాయం ఆందలేదని, కేవలం ఓట్లు వేసే వారికి మాత్రమే సాయం చేస్తున్నారన్నారు. సమావేశంలో మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ శీలం శ్రీనివాస్‌, ఎర్రంరాజు సురేందర్‌రాజు, కొమ్ము ఆశోక్‌, ఇమ్మడి సతీష్‌, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-15T06:43:30+05:30 IST