దేశంలోనే తిరుగులేని ముఖ్యమంత్రికేసీఆర్‌

ABN , First Publish Date - 2022-02-17T07:33:29+05:30 IST

దేశంలోనే తిరుగులేని ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ఎదిగారని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. బుధవారం రెండో రోజు ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదిన వేడుకలను ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భారీ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

దేశంలోనే తిరుగులేని ముఖ్యమంత్రికేసీఆర్‌
సాయిలింగి వృద్ధాశ్రమలో వృద్ధులకు పండ్లను పంపిణీ చేస్తున్న దృశ్యం

ఎమ్మెల్యే జోగు రామన్న 

జిల్లాలో కేసీఆర్‌ జన్మదిన వేడుకలు

ఆదిలాబాద్‌, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): దేశంలోనే తిరుగులేని ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ఎదిగారని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. బుధవారం రెండో రోజు ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదిన వేడుకలను ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భారీ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో  రక్తనిల్వలు పెంచే దిశగా కేటీఆర్‌ పిలుపునివ్వడం జరిగిందన్నారు. ఇందులో మున్సిపల్‌ చైర్మన్‌ జోగుప్రేమేందర్‌, జహీర్‌రంజాని, అలాల్‌ అజయ్‌, స్వరూపరాణి, మమత, యూనిస్‌అక్బాని, తదితరులు పాల్గొన్నారు. 

బోథ్‌ రూరల్‌: సీఎం కేసీఆర్‌ జన్మదిన వేడుకల్లో భాగంగా బుధవారం బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌బాపురావ్‌ మామడ మండలం బుర్కపల్లి శివాలయంలో సతీసమేతంగా అభిషేక పూజలు నిర్వహించారు.  

బోథ్‌: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హయాంలో అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తున్నాడని మాజీ మంత్రి, మాజీ ఎంపీ జి.నగేష్‌ పేర్కొన్నారు. బుధవారం బోథ్‌లోని రైతు వేదికలో ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలలో భాగంగా ఎంపీపీ తుల శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి, మాజీ ఎంపీ నగేష్‌ మాట్లాడారు.

తలమడుగు: ఆంధ్రా పాలకుల చేత నష్టపోతున్న తెలంగాణ ప్రజానికానికి విముక్తి కలిగించేందుకు ముందుకు పోరాటం సాధించి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించిన సీఎం కేసీఆర్‌ తెలంగాణ జాతిపిత అని టీఆర్‌ఎస్‌ పార్టీ మండల కన్వీనర్‌ తోట వెంకటేశ్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని బుధవారం మండలంలోని సాయిలింగి వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు, ఫలాలు, వస్ర్తాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్‌ దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రవేశ పెట్టారన్నా రు. ఇందులో టీఆర్‌ఎస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ జిల్లా కార్యదర్శి కిరణ్‌కుమార్‌, రైతుబందు మండల కో ఆర్డినేటర్‌ గోకగ జీవన్‌రెడ్డి, పార్టీ మండల ఉపాధ్యక్షుడు మగ్గిడి ప్రకాష్‌, రైతు సంఘం జిల్లా నాయకులు కాటిపెల్లి శ్రీనివాస్‌రెడ్డి, రుయ్యాడి సర్పంచ్‌ పోతారెడ్డి, సుంకిడి సర్పంచ్‌ మహేందర్‌యాదవ్‌, మహిళ సంఘంజిల్లా నాయకురాలు కాటిపెల్లి సునితారెడ్డి, సర్పంచ్‌ రాంబాయి, పల్లవి, ఎంపీటీసీ చంటి, పీఏసీఎస్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.  

ఇంద్రవెల్లి: తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శవంతంగా తీర్చి దిద్దేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ అన్నారు. నేటి సీఎం కేసీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకోని మూడు రోజుల పాటు నిర్వహించనున్న  జన్మదిన వేడుకల్లో బాగంగా బుధవారం మండల కేంద్రంలో రెండవ రోజు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే  ప్రారంభించారు. 

జైనథ్‌: రాష్ట్రంలో అధికారంలో ఉన్న సీఎం కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దేశానికి ఆదర్శమని జైనథ్‌ ఎంపీపీ ఎం.గోవర్ధన్‌, టీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు తుమ్మల వెంకట్‌రెడ్డిలు స్పష్టం చేశారు. బుధవారం ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరానికి జైనథ్‌ మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన వంద మంది టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు ఉచితంగా రక్తదానం అందజేశారు.  

భీంపూర్‌: మండలంలోని బెల్సరి రాంపూర్‌లో బుధవారం సీఎం జన్మదిన సందర్భంగా ఎంపీపీ కుడిమెత రత్నప్రభ సంతోష్‌ సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగా అక్కడ ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి వచ్చిన గర్భినులకు పండ్లు, పౌష్టికాహారంను ఎంపీపీ రత్నప్రభ సంతోష్‌ పంపిణీ చేశారు.  


Updated Date - 2022-02-17T07:33:29+05:30 IST